Puri Jagannath and Charmy : పూరి జగన్నాథ్, ఛార్మిని విచారించిన ఈడీ అధికారులు.. ఆ సినిమా గురించేనా?
Enforcement Directorate : సుమారు 12 గంటలపాటు పూరి జగన్నాథ్, ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిగింది.
కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana)లో ఈడీ పేరు గట్టిగా వినిపిస్తోంది. తాజాగా దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannath), నటి ఛార్మి(Charmy)ని ఈడీ అధికారులు(ED Officials) ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ చేశారు. 12 గంటలు పాటు విచారణ జరిగింది. ఫెమా నిబంధనల ఉల్లంఘలనకు పాల్పడ్డారని.. అధికారులు పలు ఆధారాలను సేకరించారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రానికి సంబంధించిన అంశంలో విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది.
ఓ చిత్రానికి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా(FEMA) నిబంధనలు ఉల్లంఘించారని.. అభియోగాలపై పూరి జగన్నాథ్, ఛార్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం కిందట నోటీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి.. విచారణకు హాజరయ్యారు.
ఉదయం 8 గంటలకు పూరి, ఛార్మి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. సుమారు 12 గంటల పాటు విచారణ జరిగింది. ఓ సినిమా(Cinema)కు సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో విచారణ చేశారు. దుబాయ్ కి డబ్బులు పంపించి.. అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఈడీ గుర్తించింది. అయితే ఇందులో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
అయితే లైగర్ సినిమా విషయంలోనే ఈడీ విచారణకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే అధికారులు విచారణకు పిలిచారని చెబుతున్నారు. లైగర్(Liger) సినిమా నిర్మించేందుకు విదేశాల నుంచి అధిక మెుత్తంలో డబ్బులు వీరు అందుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఫెమా(FEMA) నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలపై విచారణ చేశారు. అయితే డబ్బులు ఎందుకు జమ చేశారు? ఎవరు పంపించారనే అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీశారని అంటున్నారు. విదేశాల నుంచి నిధులు అందుకునే.. విషయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఈడీ(ED) అనుమానం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు గతంలో సినిమా పెట్టుబడుల విషయంలో కేసీఆర్ కుమార్తె కవిత(Kavitha)పై ఈడీకి ఫిర్యాదు వెళ్లింది. కాంగ్రెస్(Congress) నేత బక్క జడ్సన్ దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశారు. అక్రమంగా పెట్టుబడులు పెట్టారని చెప్పారు. బ్లాక్ మనీ, వైట్ మనీగా మార్చుకునేందుకు ఇలా చేశారని ఆరోపణలు చేశారు. కవితనే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో పాన్ ఇండియా సినిమాలు తీయాలని గతంలో ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. స్వయంగా ఈడీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇప్పుడు సినిమా పెట్టుబడుల విషయంలో ఈడీ విచారణ చేస్తుండటంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
లైగర్ సినిమా పాన్ ఇండియా(Pan India) సినిమాగా రూపొందించారు. బడ్జెట్ భారీగా అయింది. మైక్ టైసన్ కూడా నటించారు. అయితే సినిమా అనుకున్నంత రిజల్ట్ ఇవ్వలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లింపు విషయంలోనూ వివాదం నడిచింది. పూరి జగన్నాథ్ ఆడియో(Puri Jagannath Audio) ఒకటి బయటకు కూడా వచ్చింది.