Enumamula Cotton Price : రికార్డు ధర పలికిన పత్తి .. ఎంతంటే?-cotton sold record price in enumamula market ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cotton Sold Record Price In Enumamula Market

Enumamula Cotton Price : రికార్డు ధర పలికిన పత్తి .. ఎంతంటే?

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 05:37 PM IST

Warangal Cotton Price : వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర రికార్డు ధర పలికింది. ఓ వైపు వర్షాలతో పంట నష్టం జరుగుతోంది. కొత్త పత్తికి ఎక్కువ ధరతో రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

వరంగల్ ఎనుమాముల వద్ద ఉన్న అతిపెద్ద పత్తి మార్కెట్‌లో పత్తి ధర రికార్డు స్థాయిలో పలికింది. క్వింటాల్‌కు రూ.8,199 రికార్డు స్థాయికి చేరుకుంది. కొనుగోలు సీజన్ ప్రారంభంలో పత్తి రైతులకు ఉత్సాహాన్ని తెచ్చింది. ముందుగానే ఇక్కడ పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

మార్కెట్ కు కొత్త పత్తి రావడంతో కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కాకముందే అధికారులు, కమీషన్ ఏజెంట్లు, హమాలీలు తూకం మిషన్లకు పూజలు నిర్వహించారు. అంతకుముందు సంవత్సరం, రైతులు అక్టోబర్‌లో కొత్త పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్‌కు 6,000 రూపాయలకు విక్రయించారు. ఈ ఏడాది సెప్టెంబరు రెండో వారం నాటికి మార్కెట్‌కు వచ్చిన కొత్త పత్తి క్వింటాల్‌కు రూ.8,199కి విక్రయించారు.

ఈసారి వరంగల్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రారంభంలోనే అధిక ధర పలకడం రైతుల్లో సంతోషాన్ని నింపిందని మార్కెట్ కార్యదర్శి రాహుల్ అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈసారి కోట్ చేసిన ధర ఎనుమాముల మార్కెట్ అత్యధికమని గుర్తించారు.

తేమ శాతం లేకుండా నాణ్యతతో కూడిన కొత్త పత్తిని రైతులు మార్కెట్‌కు తీసుకువస్తే ధర మరింత పెరిగే అవకాశం ఉందన్నారు మార్కెట్ కార్యదర్శి. హసన్‌పర్తి మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు 14 బస్తాల పత్తితో వచ్చారు. దీన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వేలంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఎట్టకేలకు సిర్వల్లి ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. రూ.8,199కు తీసుకుంది.

గతంలో అంటే ఏప్రిల్ నెలలో ఇక్కడ పత్తి ధర క్వింటాల్ కు రూ.12,110 పలికింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు కట్టయ్య ఆరు బస్తాల పత్తి తీసుకొస్తే.. గణపతి సాయి ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్ ధర రూ.12,110 చొప్పున కొన్నారు.

IPL_Entry_Point