మేం ధర్నా చేస్తే అరెస్టులు.. మీ ధర్నాకు అనుమతులా? టీఆర్‌ఎస్‌పై రేవంత్ ఫైర్-congress protests against fuel price rise electricity charges hike ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మేం ధర్నా చేస్తే అరెస్టులు.. మీ ధర్నాకు అనుమతులా? టీఆర్‌ఎస్‌పై రేవంత్ ఫైర్

మేం ధర్నా చేస్తే అరెస్టులు.. మీ ధర్నాకు అనుమతులా? టీఆర్‌ఎస్‌పై రేవంత్ ఫైర్

HT Telugu Desk HT Telugu
Apr 07, 2022 02:05 PM IST

నెక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు విద్యుత్ సౌద వైపు దూసుకెళ్లాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, ఇనుప కంచెలను ఎక్కి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధు యాష్కీ తదితరులు దూకి వెళ్లారు.

విద్యుత్తు సౌధ వైపు నడుస్తున్న రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు
విద్యుత్తు సౌధ వైపు నడుస్తున్న రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు

పెరిగిన కరెంట్ ఛార్జీలు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. ఉదయాన్నే నేతలను హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు.. కొద్దిసేపటికి తమ ప్రయత్నాలను విరమించుున్నారు. అయినప్పటికీ ఆందోళనలు చేపట్టకుండా ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో ఇంటి దగ్గర నుండి విద్యుత్ సౌధ ముట్టడికి పాదయాత్రగా రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. 

పోలీసుల ఆంక్షలపై రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ ధర్నాలకు వర్తించని నిబంధనలు మా నిరసనలకు వర్తిస్తాయా ?  మేం ఇక్కడ పౌరులం కాదా.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఏమైనా వచ్చామా?  పేద, మధ్య తరగతి ప్రజలను దోపిడీ చేయడంలో మోడీ - కేసీఆర్ అవిభక్త కవలలుగా మారారు..’ అని అన్నారు.

‘డ్రగ్స్ పైన నిరసన తెలిపినా, ధాన్యం కొనుగోళ్లపై నిరసన తెలిపినా, గ్యాస్ - డీజిల్ - పెట్రోల్ ధరలపై నిరసన తెలిపినా అరెస్టు చేస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా మేం ధర్నాలు చేస్తున్నా.. కేసీఆర్ అడ్డుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో మిల్లర్లతో కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ కుమ్మక్కుతోనే రైతులకు దక్కాల్సిన రూ. 2,500 కోట్లను మిల్లర్లు దోచుకుంటున్నారు .  ఇందులో కేసీఆర్ కుటుంబం వాటా ఎంత? దోపిడీ లేకపోతే రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై పీడీ యాక్టు కేసు ఎందుకు పెట్టడం లేదు..’ అని ఆరోపణలు చేశారు.

ట్రాన్స్‌కో సీఎండీతో సమావేశం..

నెక్లెస్ రోడ్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు దూసుకెళ్లిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. కాంగ్రెస్ నాయకులు..

విద్యుత్ సౌద వైపు పోలీసులు ఏర్పాటు చేసిన బారికెట్లను ఇనుప కంచెలను ఎక్కి బయటకు దూకి వెళ్లిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, మధు యాష్కీ తదితరులు..

క్లెస్ రోడ్ నుంచి విద్యుత్ సౌద వరకు పాదయాత్ర గా బయలు దేరిన రెవంత్ రెడ్డి

విద్యుత్ సౌధ చేరుకున్న నేతలు

విద్యుత్ సౌధ ముందు రోడ్డు పై కూర్చొని నిరసన తెలుపుతున్న రేవంత్ రెడ్డి . పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధు యాష్కీ అంజకుమార్ యాదవ్ తదితరులు..

ఎనిమిది మందిని విద్యుత్ సౌధా లోకి అనుమతించిన పోలీసులు

ట్రాన్స్కో సి ఎం డి ప్రభాకర రావు ని కలిసిన కాంగ్రెస్ నాయకులు