Kishan Reddy on KCR : కేసీఆర్.. ఫాం హౌజ్ లో చర్చకు రమ్మంటారా.. ? కిషన్ రెడ్డి సవాల్-central minister kishan reddy challenges kcr and says he is ready for discussion on indian economy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Central Minister Kishan Reddy Challenges Kcr And Says He Is Ready For Discussion On Indian Economy

Kishan Reddy on KCR : కేసీఆర్.. ఫాం హౌజ్ లో చర్చకు రమ్మంటారా.. ? కిషన్ రెడ్డి సవాల్

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 03:45 PM IST

Kishan Reddy on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. గన్ పార్క్, ప్రగతి భవన్ లేదా ఫాం హౌజ్ కి రమ్మంటారా అని సవాల్ విసిరారు. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ విభజన 2026లోనే జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (facebook)

Kishan Reddy on KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ అన్నీ అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ తో చర్చకు సిద్ధమని... ప్రెస్ క్లబ్, గన్ పార్క్, ప్రగతి భవన్ లో ఎక్కడ చర్చకు వస్తారని సవాల్ విసిరారు. ఫౌం హౌజ్ కు రమ్మంటారా అని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ. 60 వేల కోట్ల అప్పు ఉంటే... ఇప్పుడు రూ. 5 లక్షల కోట్లకు చేరిందని... కమీషన్ల కోసమే బీఆర్ఎస్ సర్కార్ భారీ స్థాయిలో అప్పులు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. జీడీపీ పరంగా భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని... తయారీ రంగంలోనూ ప్రపంచవ్యాప్తంగా భారత్ 5వ స్థానంలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం (ఫిబ్రవరి 12) మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశాన్ని అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.... కేసీఅర్ దుర్మార్గపు ఆలోచనలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.

అసెంబ్లీ వేదికగా తనపై అనేక విమర్శలు చేసి... కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు... కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రిగా అనేక లేఖలు రాస్తే ఒక్క ఉత్తరానికి సమాధానం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చ జరగలేదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించలేదని.. కేవలం కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు, అవాస్తవాలను ప్రచారం చేసేందుకే బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ ని పొగిడి... బీజేపీ పై విమర్శలు చేశారని అన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని... నేడు అవసరం కోసం అదే పార్టీని పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన అవసరానికి ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారని... ఏ ఎండకు ఆ గొడుగు పడతారని సెటైర్ వేశారు. కమ్యునిస్టులని తిట్టి ఇప్పుడు వారితో జతకట్టారని.... మజ్లిస్ పార్టీని నిరంతరం పొగుడుతుంటారని.. ఒకరిని ఒకరు మెచ్చుకుంటారని విమర్శించారు.

కేసీఆర్.. కేంద్ర బడ్జెట్ పై అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు కిషన్ రెడ్డి. తన పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు విశ్లేషించారని చెప్పారు. కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి మాత్రం మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఇవి తెలంగాణ బడ్జెట్ సమావేశాలా లేక ప్రధాన మంత్రి వ్యతిరేక సమావేశాలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి దమ్ము, దైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎందుకు చర్చించలేదని నిలదీశారు కిషన్ రెడ్డి. దళిత బంధు, గిరిజన బంధు, రైతుల సమస్యలు, పాఠశాలలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఫీజు రీయంబర్స్ మెంట్ తదితర సమస్యలపై ఎందుకు చర్చ జరపలేదని అడిగారు. కేసీఆర్ కుటుంబం మాటి మాటికీ రాజీనామా చేస్తామని అంటున్నారని.... రాజీనామాకు అంత తొందరెందుకు అని ప్రశ్నించిన ఆయన... అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్ భవన్ లో రాజీనామా లేఖ ఇవ్వక తప్పదని అన్నారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం... తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంపై అడిగిన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కిషన్ రెడ్డి... చట్టాల్లో చాలా ఉంటాయి, అన్ని అమలవుతాయా ? అని ప్రశ్నించారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం తాము రూపొందించలేదని... గత ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ లో డి లిమిటీషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని... తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ విభజన 2026 లోనే జరుగుతుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని అన్నారు.

IPL_Entry_Point