Parliament Session : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు అప్పుడే-central govt gives clarity on telangana and andhra pradesh assembly constituencies delimitation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Parliament Session : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు అప్పుడే

Parliament Session : తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు అప్పుడే

HT Telugu Desk HT Telugu
Jul 27, 2022 03:58 PM IST

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న శానససభ నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంపై బీజేపీ ఎంపీ జీవీఎల్.. రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2026 వరకు వేచి ఉండాల్సిందేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని నిత్యానందరాయ్‌ క్లారిటీ ఇచ్చారు. 2026 జనాభా లెక్కలు వచ్చే వరకూ వేచి ఉండాలని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై తరచూ చర్చ నడుస్తూనే ఉంటుంది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని 2026 వరకు వేచి చూడాల్సిందేనని కేంద్ర మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లోని సెక్షన్ 26(1) ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 లో ఉన్న నిబంధనలకు లోబడి ఈ చట్టంలోని సెక్షన్-15 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లను 225కు, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుతారు. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 సంవత్సరం తర్వాత జనాభా లెక్కల తర్వాత.. సంఖ్యకు అనుగుణంగా సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం తెలిపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం