‘బీజేపీ ఓడిపోతుంది.. ఆ క్రెడిట్ కొంత మాకూ ఇవ్వాలి’-bjp will face defeat in telangana assembly election give credit to aimim for that asaduddin owaisi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ‘బీజేపీ ఓడిపోతుంది.. ఆ క్రెడిట్ కొంత మాకూ ఇవ్వాలి’

‘బీజేపీ ఓడిపోతుంది.. ఆ క్రెడిట్ కొంత మాకూ ఇవ్వాలి’

HT Telugu Desk HT Telugu
Feb 26, 2023 07:04 AM IST

బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోతుందని, ఇందులో కొంత క్రెడిట్ తమకూ ఇవ్వాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

నవీ ముంబైలో జరిగిన ఎంఐఎం జాతీయ సదస్సులో మాట్లాడుతున్న ఒవైసీ
నవీ ముంబైలో జరిగిన ఎంఐఎం జాతీయ సదస్సులో మాట్లాడుతున్న ఒవైసీ (PTI)

ముంబై: గత ఎన్నికల మాదిరిగానే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఓటమిని చవిచూస్తుందని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం అన్నారు.

భారతీయ జనతా పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ.. ప్రాంతీయ పార్టీలు కలిస్తే బిజెపిని ఓడించవచ్చని ఎఐఎంఐఎం చీఫ్ అన్నారు.

‘తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.. ఈ ఏడాది కూడా 2023 డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఓడిపోతుంది.. అందుకు కొంత క్రెడిట్ మాకు ఇవ్వండి’ అని ఒవైసీ అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్‌ నుంచి పోటీ చేస్తామని, రాబోయే ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తామని ఎంఐఎం చీఫ్ చెప్పారు.

‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్‌తో పాటు ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తాం.. మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తాం.. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లాలనే దానిపై వ్యాఖ్యానించడం కాస్త తొందరపాటే అవుతుంది..’ అని ఒవైసీ అన్నారు.

భివానీ హత్య విషయమై మాట్లాడుతూ ‘కొందరు ముస్లిం సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కానీ వారిపై రాజస్తాన్ ప్రభుత్వం చర్య తీసుకోదు. వారు భారత్ జోడో కార్యక్రమంలో పాల్గొంటారు. అల్వార్‌లో జరిగే రాయల్ వెడ్డింగ్‌లో పాల్గొంటారు. కానీ వారు జునైద్, నసీర్‌లను చంపిన ప్రదేశానికి వెళ్లలేరు..’ అని విమర్శించారు.

అంతకుముందు ఫిబ్రవరి 23న ఎంఐఎం చీఫ్ మాట్లాడుతూ జునైద్, నాసిర్ ముస్లింలు కాకపోతే అశోక్ గెహ్లాట్ ఇప్పటి వరకు అక్కడికి హడావిడిగా వెళ్లేవారని అన్నారు. 

ఫిబ్రవరి 16 ఉదయం హర్యానాలోని భివానీ జిల్లాలో బరావాస్ గ్రామ సమీపంలో ఒక ఎస్‌యూవీ కారులో కాలిపోయిన రెండు అస్థిపంజరాలను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ వ్యవహారంలో భజరంగ్ దళ్ సభ్యుడు మోను మనేసర్‌పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పలు హిందు సంఘాల నుంచి నిరసన ఎదురైంది. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు భివానీలో శవమై కనిపించిన తరువాత వారిని జునైద్, నాసిర్‌లుగా గుర్తించారు. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలతో వారిని కిడ్నాప్ చేసి కొట్టి చంపారని ఆరోపణలు వచ్చాయి. 

IPL_Entry_Point

టాపిక్