BC Overseas Scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం, ఫిబ్రవరి 1 నుంచే దరఖాస్తులు -applications invited for bc overseas scholarship from 1st february 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Applications Invited For Bc Overseas Scholarship From 1st February 2023

BC Overseas Scholarship: విదేశీ విద్యకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం, ఫిబ్రవరి 1 నుంచే దరఖాస్తులు

HT Telugu Desk HT Telugu
Jan 27, 2023 10:17 AM IST

Bc Overseas Vidya Nidhi Scholarship Applications: విదేశాల్లో విద్యను అభ్యసించుకోవాలనుకునే బీసీ విద్యార్థులకు ప్రభుత్వం కీలక అలర్ట్ ఇచ్చింది. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం' కింద ఫిబ్రవరి 1 దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది.

విదేశీ విద్యానిధికి దరఖాస్తులు
విదేశీ విద్యానిధికి దరఖాస్తులు

BC Overseas Vidya Nidhi scholarship in Telangana:విదేశాల్లో చదువుకోవాలనుకునే బీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

'మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకం' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు మార్చి ఒకటో తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఎంపికైన బీసీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. విద్యార్థులు వీసా, పాస్‌పోర్ట్ కాపీతోపాటు, ఆధార్‌కార్డు, స్థానికత, కుల, ఆదాయ, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్‌కొరియా దేశాల్లో ఉన్నత విద్యావకాశం పొందినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అర్హులు..

-బీసీ విద్యార్థులు మాత్రమే అర్హులు

-జూలై 1, 2023 నాటికి వయసు 35 ఏళ్లు దాటవద్దు

-వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు మాత్రమే ఉండాలి.

-60 శాతం మార్కులతో డిగ్రీ అర్హత పొంది ఉండాలి

-GRE/GMAT, TOEFL/ IELTS /PTE రాసి మంచి స్కోర్లు సాధించిన వారికి 20శాతం వెయిటేజ్ కూడా ఉంటుంది.

-అర్హులైన అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

-ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం

-దరఖాస్తులకు మార్చి 1, 2023 చివరి తేదీ

IPL_Entry_Point