4G services : 425 గ్రామాల్లో 4జీ సేవలు.. మీ ప్రాంతంలో సర్వీస్ ఉందా?-4g services soon in uncovered 425 villages in telangana look inside for villages list ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  4g Services : 425 గ్రామాల్లో 4జీ సేవలు.. మీ ప్రాంతంలో సర్వీస్ ఉందా?

4G services : 425 గ్రామాల్లో 4జీ సేవలు.. మీ ప్రాంతంలో సర్వీస్ ఉందా?

HT Telugu Desk HT Telugu
Aug 01, 2022 02:35 PM IST

తెలంగాణలోని కొన్ని గ్రామాలలో ఇప్పటికీ 4 జీ సేవలు అందుబాటులో లేవు. 425 గ్రామాలను 4జీ సేవల పరిధిలోకి త్వరలో తేనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అన్ని గ్రామాల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం 'అంత్యోదయ' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 4జీ మొబైల్ సేవలను అందుబాటులో లేని గ్రామాలకు ఆ సేవలను విస్తరించేందచుకు ప్రణాళికలు చేస్తోంది. ఈ మేరకు.. ఆమోదం తెలిపింది. BSNL రూ. 26 వేల కోట్లతో సెంట్రల్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తుంది. దేశంలోని.. 29,616 గ్రామాలకు 4జీ సేవలను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణలోని 425 గ్రామాలు.. 4జీ సేవల పరిధిలోకి రానున్నాయి.

కేంద్ర కమ్యూనికేషన్లు మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 26,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనిని అప్పగించింది.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 4జీ మొబైల్ సేవల పరిధిలోకి రాని 400కు పైగా గ్రామాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4G సేవలు లేని గ్రామాలు అత్యధికంగా ఉన్నాయి. కేంద్ర ఏజెన్సీలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తెలంగాణలోని 10,434 రెవెన్యూ గ్రామాలలో మొత్తం 425 గ్రామాలకు 4జీ సర్వీస్ సౌకర్యం లేదు. 4G సేవలు లేని ఇతర గ్రామాలు ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్నాయి.

ఎంపికైన గ్రామాలు ఇవే..

ఆదిలాబాద్ జిల్లాలో 53 గ్రామాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 41 గ్రామాలు, జగిత్యాల జిల్లాలో 1, జయశంకర్ భూపాలపల్లిలో 26 గ్రామాలు, కామారెడ్డిలో 1, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 159 గ్రామాలు, మహబూబాబాద్ జిల్లాలో 34 గ్రామాలు, మంచిర్యాల జిల్లాలో 7 గ్రామాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, ములుగులో 45 గ్రామాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 8 గ్రామాలు, నల్లగొండలో 15 గ్రామాలు, నారాయణపేటలో 2, నిర్మల్‌లో 21 గ్రామాలు, నిజామాబాద్ జిల్లాలో 4, రంగారెడ్డిలో 2, సంగారెడ్డిలో 1, వనపర్తిలో 1, వరంగల్ అర్భన్‌లో 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5 గ్రామాలు.. 4జీ సేవల కిందకు రానున్నాయి.

IPL_Entry_Point