Latif on Arjun Tendulkar: ఇలా అయితే అర్జున్ వేగంగా బౌలింగ్ చేయలేడు: పాక్ మాజీ క్రికెటర్-latif on arjun tendulkar sasy his alignment is not good ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Latif On Arjun Tendulkar: ఇలా అయితే అర్జున్ వేగంగా బౌలింగ్ చేయలేడు: పాక్ మాజీ క్రికెటర్

Latif on Arjun Tendulkar: ఇలా అయితే అర్జున్ వేగంగా బౌలింగ్ చేయలేడు: పాక్ మాజీ క్రికెటర్

Hari Prasad S HT Telugu
Apr 21, 2023 02:48 PM IST

Latif on Arjun Tendulkar: ఇలా అయితే అర్జున్ వేగంగా బౌలింగ్ చేయలేడని పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అన్నాడు. నిజానికి అర్జున్ వేగం తక్కువగా ఉండటంపై విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

వేగంగా బౌలింగ్ చేయలేకపోతున్న అర్జున్ టెండూల్కర్
వేగంగా బౌలింగ్ చేయలేకపోతున్న అర్జున్ టెండూల్కర్ (AFP)

Latif on Arjun Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పై గత వారం రోజులుగా క్రికెట్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడైన సచిన్ తనయుడు కావడంతో క్రికెట్ ప్రపంచమంతా అతన్ని ఆసక్తిగా గమనించింది. చాలా రోజులు డగౌట్ కే పరిమితమైన అర్జున్ కు ఈ మధ్యే ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.

కేకేఆర్ తో వికెట్ తీయలేకపోయినా.. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో చివరి ఓవర్ అద్భుతంగా వేసి వికెట్ తీయడంతోపాటు ముంబైని గెలిపించాడు. దీంతో చాలా మంది మాజీ క్రికెటర్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయితే అతని బౌలింగ్ వేగం చాలా తక్కువగా ఉండటంతో సోషల్ మీడియాలో అభిమానులు అతన్ని ట్రోల్ చేశారు. పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా ఇప్పుడిదే అంశాన్ని లేవనెత్తాడు.

బంతిని విసిరే సమయంలో అర్జున్ పొజిషన్ సరిగా ఉంటేనే పేస్ పెరుగుతుందని లతీఫ్ చెప్పాడు. "అతడు ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నాడు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. అతని పొజిషన్ సరిగా లేదు. దీంతో సరిపడా పేస్ జనరేట్ చేయలేడు" అని యూట్యూబ్ ఛానెల్ కాట్ బిహైండ్ లో లతీఫ్ అన్నాడు. దీనికోసం అతడు ఓ బయోమెకానికల్ కన్సల్టెంట్ ను సంప్రదించాలని కూడా సూచించాడు.

"ఓ మంచి బయోమెకానికల్ కన్సల్టెంట్ అతనికి మార్గనిర్దేశనం చేస్తే.. అతడు తన బౌలింగ్ కు పేస్ జోడించగలుగుతాడు. ఓ ప్లేయర్ ను కోచింగ్ ద్వారా మార్చడం ఓ మంచి సబ్జెక్ట్. ఆ పని సచిన్ చేసి ఉండొచ్చు. కానీ అతడు డొమెస్టిక్ క్రికెట్ పై ఆధారపడ్డాడు. బేస్ బలంగా ఉండాలి.

అతడు బంతి విసిరే సమయంలో లోనికి రావాల్సింది బయటకు వెళ్లిపోతున్నాడు. అతని బ్యాలెన్స్ బాగా లేదు. అదే అతని పేస్ పై ప్రభావం చూపుతోంది. అతడు గంటకు 135 కి.మీ. వేగాన్ని అందుకోగలడు. వచ్చే రెండు, మూడేళ్లలో మంచి ప్లేయర్ అవుతాడు" అని లతీఫ్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం