Dwayne Bravo World Record: చరిత్ర సృష్టించిన బ్రేవో.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌-dwayne bravo becomes first cricketer in t20s to take 600 wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dwayne Bravo Becomes First Cricketer In T20s To Take 600 Wickets

Dwayne Bravo World Record: చరిత్ర సృష్టించిన బ్రేవో.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌

Hari Prasad S HT Telugu
Aug 12, 2022 09:59 AM IST

Dwayne Bravo World Record: ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకూ మరే ఇతర క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును బ్రేవో సొంతం చేసుకున్నాడు.

డ్వేన్ బ్రేవో (ఫైల్ ఫొటో)
డ్వేన్ బ్రేవో (ఫైల్ ఫొటో) (Twitter)

లండన్‌: వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో 600 వికెట్లు తీశాడు. ది హండ్రెడ్‌ టోర్నీలో భాగంగా నార్తర్న్‌ సూపర్‌ఛార్జర్స్‌ టీమ్‌ తరఫున ఆడుతున్న బ్రేవో ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. గురువారం ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రేవో తన 600వ వికెట్‌ తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఓవల్‌ బ్యాటర్‌ సామ్‌ కరన్‌ను ఔట్‌ చేయడం ద్వారా బ్రేవో తన 600వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు రిలీ రొస్సోను కూడా ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 598 వికెట్లతో ఉన్న బ్రేవో.. ఈ రెండు వికెట్లు తీయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. అత్యధిక వికెట్ల లిస్ట్‌లో బ్రేవో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. బ్రేవో తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ 339 మ్యాచ్‌లలో 466 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు.

2006, ఫిబ్రవరి 16న తొలి టీ20 మ్యాచ్‌ను వెస్టిండీస్‌ తరఫున న్యూజిలాండ్‌పై ఆడిన బ్రేవో.. ఇప్పటి వరకూ తన కెరీర్‌లో 25 టీమ్స్ తరఫున ఆడటం విశేషం. అతడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఎక్కువ కాలం ఆడిన విషయం తెలిసిందే. పైగా ఈ మెగాలీగ్‌లోనూ అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఈ సీజన్‌లోనే రికార్డు క్రియేట్‌ చేశాడు. ఐపీఎల్‌లో 161 మ్యాచ్‌లు ఆడిన బ్రేవో.. 183 వికెట్లు తీయడం విశేషం. రెండు సీజన్లలో అత్యధిక వికెట్లు తీసుకొని పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు.

బ్రేవో వెస్టిండీస్‌ తరఫున 91 మ్యాచ్‌లలో 78 వికెట్లు తీయగా.. మిగతా 522 వికెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంఛైజీలు, డొమెస్టిక్‌ క్రికెట్‌లో తీశాడు. వెస్టిండీస్‌ టీమ్‌ తరఫున టీ20 వరల్డ్‌కప్‌ కూడా గెలిచాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా వివిధ టీ20 లీగ్స్‌లో ఆడుతున్నాడు. తాజాగా యూఏఈలో జరగనున్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లోనూ ఆడనున్నాడు. గురువారమే లీగ్‌ పలువురు క్రికెటర్ల పేర్లు ప్రకటించగా.. అందులో బ్రేవో కూడా ఉన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం