Chandra Grahanam 2023 । బుద్ధ పూర్ణిమ నాడే చంద్రగ్రహణం.. సూతకకాలం ఎప్పుడు?-chandra grahanam 2023 occurs on buddha purnima know sutak kal timings and more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Chandra Grahanam 2023 Occurs On Buddha Purnima, Know Sutak Kal Timings And More

Chandra Grahanam 2023 । బుద్ధ పూర్ణిమ నాడే చంద్రగ్రహణం.. సూతకకాలం ఎప్పుడు?

HT Telugu Desk HT Telugu
May 05, 2023 10:52 AM IST

Chandra Grahanam 2023: 2023 మే 5న ఏర్పడుతున్న చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం మే 5న రాత్రి 8.45 PM సమయానికి ప్రారంభమైన మే 6న 1.02 AM IST వరకు కొనసాగుతుంది. సూతక సమయం తెలుసుకోండి.

Chandra Grahanam 2023
Chandra Grahanam 2023 (Unsplash)

Chandra Grahanam 2023: ఈరోజు 2023వ ఏడాదికి సంబంధించిన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మిగతా వాటికంటే భిన్నమైనది. చంద్రుడు అంబ్రా అనే లోతైన నీడ కలిగిన ప్రాంతం నుండి కాకుండా పెనంబ్రా అనే తేలికపాటి నీడ గుండా కదులుతాడు. కాబట్టి ఇది పెనంబ్రల్ గ్రహణం అవుతుంది. ఈ ఖగోళ సంఘటన భూమిపై అనేక ప్రాంతాలలో దర్శనం ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలు, గ్రహణాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉండే మానవుల స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితులను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. గతేడాది కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడగా ఈ ఏడాది బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం సంభవించడం గమనార్హం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహణం అనేది వివిధ రాశి చక్రాలపై శుభ, అశుభ ఫలితాలను కలిగి ఉంటుంది. గ్రహణానికి ముందు సూతక కాలం అనేది ఉంటుంది. ఈ సూతక కాలం అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో కొన్నిరకాల కార్యాలలో పాల్గొనడం నిషేధించడమైనది.

సూతకం అంటే ఏమిటి? ఈరోజు సూతక సమయం ఎప్పుడు?

గ్రహణం ఏర్పడే కొన్ని గంటల ముందు కాలాన్ని సూతక కాలం అంటారు. ఈ సమయంలో భూమి వాతావరణం మలినం అవుతుంది, అందువల్ల ఇది అశుభకర సమయంగా పేర్కొంటారు. ఈ సమయంలో దాని ప్రతికూల ప్రభావం మానవ శరీరం, మనస్సుపై పడుతుందని చెబుతారు. సూర్య గ్రహణానికి 12 గంటల ముందు, చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు సూతకం గమనించడం జరుగుతుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యచంద్రుల గ్రహణాలకు కారణమయ్యేది రాక్షస దేవుడైన రాహు-కేతువులు. ఈ సృష్టికి మూలం, ప్రాకృతిక చర్యలన్నింటికీ కారణం సూర్యచంద్రులే. కాబట్టి వాటికి గ్రహణాలు ఏర్పడినపుడు ప్రాకృతిక చర్యలు నిలిచిపోతాయి. ఇలాంటి సమయంలో పనులు చేయడం మంచిది కాదు, ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు, దేవాలయాలను సందర్శించవద్దని, ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించవద్దని అని శాస్త్రం చెబుతుంది.

2023 మే 5న ఏర్పడుతున్న చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం మే 5న రాత్రి 8.45 PM సమయానికి ప్రారంభమైన మే 6న 1.02 AM IST వరకు కొనసాగుతుంది.

సూతక సమయం శుక్రవారం 11:45 a.m.కి ప్రారంభమవుతుంది. అయితే ఇది పెనంబ్రల్ చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహణం మీ ప్రాంతంలో కనిపించకపోతే సూతక కాలం చెల్లదు అని జ్యోతిష్యులు చెప్పారు.

సూతక కాలంలో ఈ పనులు చేయవద్దు

గ్రహణానికి ముందు ఉన్న సూతక కాలంతో పాటు గ్రహణ ప్రభావం ఉన్నంత కాలం కొన్ని కార్యకలాపాలు నిర్వహించడం నిషేధం. ఈ సమయంలో, ఏ రకమైన ఘన లేదా ద్రవం తినకూడదు. అందుకే చంద్రగ్రహణం ప్రారంభమయ్యే 9 గంటల ముందు ఏమీ తినకూడదు, తాగకూడదు. అనారోగ్యంతో ఉన్నవారు అలాగే గర్భిణీ స్త్రీలు తాజా పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి, ఇది కాకుండా, తులసి ఆకులను కలిపిన తర్వాత మాత్రమే నీరు త్రాగాలి.

WhatsApp channel

సంబంధిత కథనం