తెలుగు న్యూస్ / ఫోటో /
Maserati MC20 Cielo | సీతాకోక చిలుకలా విచ్చుకునే సూపర్ స్పోర్ట్స్ కార్..!
- ఇటాలియన్ వాహన తయారీ సంస్థ మాసెరాటి బ్రాండ్ నుంచి MC20 సూపర్ స్పోర్ట్స్ కారులో స్పైడర్ వెర్షన్‌ను విడుదల చేసింది. 'సియెలో' అనే పేరుతో విడుదలైన ఈ కార్ చాలా భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ కారుకు ఉన్న ముడుచుకునేలా రిట్రాక్టబుల్ పైకప్పుకు అనుగుణంగా అనేక మార్పులు కొత్తగా కనిపిస్తున్నాయి.

(1 / 7)
ఇటాలియన్ లగ్జరీ కార్ మార్క్యూ సూపర్‌కార్‌ను పరిచయం చేసిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆ తరహాలో కొత్త వేరియంట్ వచ్చింది. మరిన్ని ప్రత్యేక వేరియంట్‌లను కూడా తీసుకువస్తుంది, వాటిలో ఒకటి PrimaSerie లాంచ్ ఎడిషన్.
(2 / 7)
మాసెరాటి MC20 Cielo వెనుక భాగంలో ఉన్న ట్రైడెంట్ వెంట్‌లను మార్చారు. వాటి స్థానంలో మాట్టే టైటానియం ట్రైడెంట్ డికాల్‌ని అందించారు. ఇంజిన్ ఎయిర్ ఇన్‌టేక్‌లు కూడా మార్చారు. అయితే బటర్ ఫ్లై డోర్స్ మాత్రం అలాగే ఉంచారు.
(3 / 7)
లగ్జరీ స్పోర్ట్స్ కార్ Mc20 Cieloలో ఓపెన్ రూఫ్ చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే స్పెసిఫికేషన్, ఇతర ఫీచర్లు మాత్రం ప్రామాణిక మాసెరాటి కూపేలో ఉన్నట్లే ఉన్నాయి.
(4 / 7)
మాసెరాటి MC20 Cielo MC20లో కూడా అదే 3.0-లీటర్ Nettuno V6 ఇంజన్ ఉంటుంది. దీనిని 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు. ఈ ఇంజన్ 621 hp శక్తిని, 730 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది....
(5 / 7)
మాసెరాటి MC20 కార్బన్-ఫైబర్ మోనోకోక్ మూడు వేరియంట్‌లను కలిగి ఉంది. ఒకటి స్థిరమైన రూఫ్ కలిగిన కూపే కోసం, ఒకటి కన్వర్టిబుల్ కోసం అలాగే ఇంకొకటి EV కోసం కేటాయించారు.
(6 / 7)
సాధారణ కూపేతో పోలిస్తే మరింత దృఢంగా MC20 మోడల్‌ను రూపొందించినట్లు మాసెరాటి పేర్కొంది. ఈ అదనపు దృఢత్వం Cielo ముడుచుకునే పైకప్పుకు రక్షణగా ఉంటుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు