Maruti Suzuki S-Cross కారు మాయం.. ఎందుకు, ఏమిటి, ఎలా?
Maruti Suzuki S-Cross Removed From Nexa Dealership: నెక్సా అధికారిక వెబ్‌సైట్ నుండి మారుతి సుజుకి S-క్రాస్ కారును తొలగించారు. అంటే ఇకపై భారత మార్కెట్లో ఈ కారు ఉత్పతి జరగదని అర్థం చేసుకోవాలి. ఇదివరకు మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా S-క్రాస్ ఉండేది. అయితే ఇప్పుడు గ్రాండ్ విటారా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది.
(1 / 4)
Maruti Suzuki S-Cross 2015లో లాంచ్ అయింది. అయినప్పటికీ ఈ ఏడు సంవత్సరాల కాలంలో అమ్మకాల్లో ఈ కార్ చాలా వెనకబడింది. గత కొన్ని నెలలుగా అమ్మకాలు సున్నాగా ఉన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో నెక్సా వెబ్‌సైట్ జాబితాలో ఈ కారును తొలగించారు. దీంతో ఈ కార్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు నిశబ్దంగా సూచించినట్లయింది.(Maruti Suzuki)
(2 / 4)
మారుతి ఇటీవలే గ్రాండ్ విటారాను విడుదల చేసింది. ఈ కారు S క్రాస్‌ను భర్తీ చేస్తుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇదే కారు నేరుగా ఎస్ క్రాస్ అమ్మకాలను దెబ్బతీసింది. విటారా లాంచ్ అవగానే ఎస్-క్రాస్ అమ్మకాలు ఆగిపోయాయి. కానీ సుజుకి S-క్రాస్ ఏమంత తక్కువ చేసే కారు కాదు.(AFP)
(3 / 4)
జూన్ నెల నుంచి ఎస్ క్రాస్ అమ్మకాలు బాగా క్షీణించాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఈ కారు ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఇదే సమయంలో ఈ ధరల విభాగంలో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ పెరగడం ప్రారంభమైంది.(Maruti Suzuki)
(4 / 4)
Maruti Suzuki S-Cross తీసివేసిన తర్వాత NEXA లైనప్ ఇప్పుడు బాలెనో, ఇగ్నిస్, సియాజ్, XL6 అలాగే గ్రాండ్ విటారా అనే ఐదు వాహనాలను కలిగి ఉంది..(twitter)
ఇతర గ్యాలరీలు