Songs to Instagram profile: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో ఇంపైన ఫీచర్-you may soon be able to add songs to your instagram profile find details here
Telugu News  /  National International  /  You May Soon Be Able To Add Songs To Your Instagram Profile Find Details Here
ప్రొఫైల్‌కు సాంగ్స్ యాడ్ చేసుకునే ఫీచర్ తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్
ప్రొఫైల్‌కు సాంగ్స్ యాడ్ చేసుకునే ఫీచర్ తెస్తున్న ఇన్‌స్టాగ్రామ్ (Photo: AFP)

Songs to Instagram profile: ఇన్‌స్టాగ్రామ్ నుంచి మరో ఇంపైన ఫీచర్

25 October 2022, 16:30 ISTPraveen Kumar Lenkala
25 October 2022, 16:30 IST

Songs to Instagram profile: ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు ఇక సాంగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ అంతర్గతంగా అభివృద్ధి దశలో ఉంది.

songs to Instagram profile: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లతో టీనేజర్లు, యూత్‌ను ఆకట్టుకుంటోంది. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సాంగ్స్ యాడ్ చేసుకునేందుకు వీలు కల్పించేలా ఒక ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

అలెసాండో పలూజి అనే టెక్ సావీ ఈ ఫీచర్ గురించిన సమాచారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రొఫైల్ పేజీలో యూజర్స్ బయో కింద ఈ సాంగ్ కనిపిస్తుందని వివరించారు. త్వరలో రాబోయే ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ప్రోటోటైప్‌గా ఉందని, ఇంకా యూజర్లకు అందుబాటులోకి రాలేదని తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్ అధికార ప్రతినిధి ఒకరు దీనిని ధ్రువీకరిస్తూ ఇంటర్నల్ ప్రోటోటైప్‌గా ఉందని, ఇంకా బీటా టెస్టింగ్‌కు రాలేదని వివరించారు.

ప్రొఫైల్‌కు సాంగ్స్ జత చేసే సౌలభ్యాన్ని ఇస్తున్న సోషల్ మీడియా కంపెనీల్లో ఇన్‌స్టాగ్రామ్ మొదటిది కాదు. మైస్పేస్ సోషల్ మీడియా వంటి ప్లాట్‌ఫామ్స్ చాలా ఏళ్ల కిందే ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా యూజర్లకు అందుబాటులోకి రాలేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు మ్యూజిక్ యాడ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు యాప్ లైబ్రరీ నుంచి గానీ, స్పాటిఫై లాంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి గానీ సాంగ్స్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ఇన్‌స్టంట్ ఫోటో షేరింగ్ యాప్ ఇప్పటికే పలు కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు వాళ్లు ఇంకో ఖాతా క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ చేసినప్పుడు ఆ యూజర్ ఏ ఖాతా క్రియేట్ చేసిన ఇక మిమ్మల్ని ఫాలో కాలేరు. కనెక్ట్ కాలేరు.

అలాగే మీకు నచ్చని పదాలతో కూడిన కామెంట్స్ ఎవరైనా చేస్తే హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్ ద్వారా ఆ కంటెంట్‌ను తొలగించివేస్తుంది. దాదాపు 40 శాతం కామెంట్లు నేరపూరితమైన కంటెంట్‌గా ఉంటున్నాయని సదరు కంపెనీ ఈ ఫీచర్ తెచ్చింది. కంపెనీ ఈ హిడెన్ వర్డ్స్ అనే ఫీచర్‌ను క్రియేటర్ అకౌంట్స్‌లో ఆటోమేటిగ్గా ఆన్‌లో ఉండేలా చేసి పరీక్షిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ ఫీచర్‌ను ఏ యూజర్ అయినా ఆన్ లేదా ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. తమకు నచ్చని కంటెంట్‌కు సంబంధించిన పదాలను, వాక్యాలను, ఎమోజీలను ఈ ఫీచర్‌కు జతచేస్తే ఆ కంటెంట్‌తో కూడిన కామెంట్లు డిలీట్ అయిపోతాయి.