WhatsApp edit message feature : ఇక వాట్సాప్​లో మెసేజ్​లు 'ఎడిట్​' చేసేయ్​!-whatsapp working on a feature to allow users edit sent messages ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Whatsapp Working On A Feature To Allow Users Edit Sent Messages

WhatsApp edit message feature : ఇక వాట్సాప్​లో మెసేజ్​లు 'ఎడిట్​' చేసేయ్​!

Sharath Chitturi HT Telugu
Sep 18, 2022 01:57 PM IST

WhatsApp edit message feature in telugu : వాట్సాప్​లో ఏదైనా మెసేజ్​ను తప్పుగా టైప్​ చేస్తే.. దానిని డిలీట్​ చేయాల్సి వస్తోంది. కానీ త్వరలోనే వాట్సాప్​ ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు..

ఇక వాట్సాప్​లో మెసేజ్​లు 'ఎడిట్​' చేసేయ్​!
ఇక వాట్సాప్​లో మెసేజ్​లు 'ఎడిట్​' చేసేయ్​! (HT_PRINT)

WhatsApp edit message feature : సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడంతా 'ఎడిట్'​ ఫీచర్​పైనే చర్చ! ట్విట్టర్​కు ఎడిట్​ ఫీచర్​ వస్తోంది. ఇక ఇప్పుడు వాట్సాప్​కి కూడా ఎడిట్​ ఫీచర్​ వస్తోందని సమాచారం! వాట్సాప్​ ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ను బిటా వర్షెన్​లో టెస్ట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న అప్డేట్స్​లో భాగంగా ఈ ఫీచర్​ను వాట్సాప్​ తీసుకొచ్చే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఇంతకాలం వాట్సాప్​లో ఏదైనా మెసేజ్​ను పంపిన తర్వాత.. దానిని ఎడిట్​ చేసే అప్షన్​ లేదు. ఆ మెసేజ్​ను డిలీట్​ చేయాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు.. వాట్సాప్​ ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ అందుబాటులోకి వస్తే.. మెసేజ్​ పంపించిన తర్వాత కూడా దానిని ఎడిట్​ చేసుకోవచ్చు. ఫలితంగా హడావుడిగా ఏవైనా మెసేజ్​లు పంపించిన తర్వాత కూడా వాటిని ఎడిట్​ చేసుకునే అవకాశం దక్కుతుంది. ఈ విషయాన్ని వాబిటాఇన్​ఫో నివేదిక పేర్కొంది.

వాస్తవానికి వాట్సాప్​లో ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​పై చాలా రోజులుగా అప్డేట్​ రావాల్సి ఉంది. వాట్సాప్​ యూజర్స్​ కూడా దీని కోసం ఎదురుచూస్తున్నారు.

WhatsApp edit message feature in telugu : నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ దశలోనే ఉంది. గూగుల్​ప్లే బిటాలో వాట్సాప్​ వర్షెన్​ 2.22.20.12లో దీనిని భాగంగా చేసి పరీక్షిస్తున్నారు. దీని రిలీజ్​ డేట్​ను వాట్సాప్​ ఇంకా ప్రకటించలేదు.

వాట్సాప్​లో ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ ఎలా పనిచేస్తుంది? అన్న విషయంపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే.. ఒకవేళ మెసేజ్​ను ఎడిట్​ చేస్తే.. దాని పక్కనే 'ఎడిటెడ్​' అని కనిపిస్తుందని తెలుస్తోంది. మెసేజ్​ చేసిన కొంత సమయం వరకే ఈ ఫీచర్​ను వినియోగించుకునే అవకాశం ఉంటుందని సమాచారం.

Whatsapp new features news : ఇండియాలో వాట్సాప్​కు దాదాపు 50కోట్ల మంది యూజర్స్​ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూజర్స్​కు మెరుగైన అనుభూతిని కల్పించేందుకు వాట్సాప్​ నిత్యం కృషి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో కొత్త ఫీచర్స్​ను ప్రవేశపెట్టింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం