Presidential election : నేడే రాష్ట్రపతి ఎన్నిక.. ద్రౌపది ముర్ము వర్సెస్​ యశ్వంత్​ సిన్హా-voting for presidential election today on 18th july it s droupadi murmu vs yashwant sinha ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Presidential Election : నేడే రాష్ట్రపతి ఎన్నిక.. ద్రౌపది ముర్ము వర్సెస్​ యశ్వంత్​ సిన్హా

Presidential election : నేడే రాష్ట్రపతి ఎన్నిక.. ద్రౌపది ముర్ము వర్సెస్​ యశ్వంత్​ సిన్హా

Sharath Chitturi HT Telugu
Jul 18, 2022 05:03 AM IST

Presidential election : నేడు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ముర్ము- సిన్హాలో ఒకరిని తమ ఓటు హక్కు ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.

నేడే రాష్ట్రపతి ఎన్నిక
నేడే రాష్ట్రపతి ఎన్నిక (HT)

Presidential election : 2022 రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలో.. దేశవ్యాప్తంగా ఉన్న 4వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ద్రౌపది ముర్ము- యశ్వంత్​ సిన్హాలలో ఒకరు భారతదేశ 15వ రాష్ట్రపతిగా అవతరించనున్నారు.

ఓటింగ్​ ప్రక్రియ..

  • సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్​, వివిధ రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలో ఓటింగ్​ జరుగుతుంది.
  • రహస్య బ్యాలెట్​ పద్ధతిలోనే రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంతేకాకుండా.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయా పార్టీలు విప్​ కూడా జారీ చేయలేవు. తమకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేసుకునే అవకాశం అందరికి ఉంటుంది.
  • రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రత్యేక పెన్​ను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అందులో వైలెట్​ ఇంకు ఉంటుంది. ఓటర్లు.. ఆ పెన్​తోనే అభ్యర్థుల జాబితా ఉన్న బ్యాలెట్​ పేపర్​పై ఓటు వేయాల్సి ఉంటుంది.
  • ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. ఎంపీలకు ఆకుపచ్చ రంగు పేపర్​ అందుతుంది. ఎమ్మెల్యేలకు గులాబీ రంగు పేపర్​ లభిస్తుంది. ఇలా చేస్తే.. రిటర్నింగ్​ ఆఫీసర్ పని సులభమవుతుందని ఈసీ భావిస్తోంది.
  • పార్లమెంట్​- శాసనసభ సభ్యులు, ఓటు 'వాల్యూ' ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఉత్తర్​ప్రదేశ్​లో ప్రతి ఎమ్మెల్యే ఓటు వాల్యూ.. 208. ఝార్ఖండ్​- తమిళనాడులో అది 176.

ఎవరి బలం ఎంత?

Draupadi Murmu : ఈ దఫా రాష్ట్రపతి ఎన్నికలో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవడం ఖాయమే. కాగా.. యశ్వంత సిన్హాపై ఎంత మెజారిటీతో గెలుస్తారు? అన్నదే ఇక్కడ అసలు విషయం.

బీజేపీతో పాటు బీజేడీ, జేడీ-ఎస్​, టీడీపీ, వైసీపీ, లోక్​ జన్​శక్తి పార్టీ, బీఎస్​పీ, శిరోమణి అకాలీదళ్, అన్నాడీఎంకే పార్టీల మద్దతు ద్రౌపది ముర్ముకే ఉంది. ఉద్ధవ్​ ఠాక్రేకు చెందిన శివసేన కూడా.. ముర్ముకే మద్దతు ప్రకటించడం విశేషం.

మరోవైపు యశ్వంత్​ సిన్హాకు కాంగ్రెస్​, టీఎంసీ, వామపక్షాలు, ఎన్​సీపీ, ఏఐఎంఐఎం, ఆర్​జేడీ, ఆప్​ మద్దతు ఉన్నా.. గెలుపునకు కావాల్సిన మెజారిటీ లేదు.

ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం