Tripura polling: పోలింగ్ బూత్ లకు పోటెత్తిన ఓటర్లు-tripura records 81 per cent polling till 4 pm voters waiting in queues ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tripura Records 81 Per Cent Polling Till 4 Pm, Voters Waiting In Queues

Tripura polling: పోలింగ్ బూత్ లకు పోటెత్తిన ఓటర్లు

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 09:54 PM IST

Tripura polling: త్రిపురలో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్ లకు పోటెత్తారు. ఈశాన్య రాష్ట్రం పౌరులు నిజమైన ప్రజాస్వామ్య చైతన్యం చూపారు. ఫిబ్రవరి 16న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82% త్రిపుర ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.

త్రిపురలో ఓటేసిన మహిళలు
త్రిపురలో ఓటేసిన మహిళలు (PTI)

Tripura polling: త్రిపురలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 60 సీట్లకు ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ (Tripura polling) నిర్వహించింది. 60 స్థానాల్లో మొత్తం 259 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అధికార బీజేపీకి పోటీగా వామపక్షాలు, కాంగ్రెస్ జతకట్టి బరిలో నిలిచాయి.

Tripura polling: 82% పోలింగ్

త్రిపురలో పోలింగ్ ఫిబ్రవరి 16,గురువారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అయితే, అప్పటికే పోలింగ్ బూత్ ల వద్ద క్యూలలో ఉన్నవారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఎన్నికల సంఘం (election commission) తెలిపిన వివరాల ప్రకారం పోలింగ్ (Tripura polling) సమయం ముగిసిన సాయంత్రం 4 గంటల వరకు త్రిపురలో మొత్తం 81. 11% ఓటింగ్ జరిగింది. ఇంకా కనీసం 50 వేల మంది ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. అంటే, పోలింగ్ శాతం మరింత పెరగుతుంది. పోలింగ్ బూత్ ల వద్ద లైన్లలో నిలుచున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల సంఘం (election commission) అధికారులు తెలిపారు.

Tripura polling: 2018 లో 79%

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్రిపురలో 79% పోలింగ్ (Tripura polling) నమోదైంది. క్యూ లైన్లలో నిలుచున్న ఓటర్ల కోసం అప్పుడు రాత్రి 9.30 గంటల వరకు కూడా పోలింగ్ (Tripura polling) నిర్వహించారు. ఈ సారి మిజోరం నుంచి వచ్చి త్రిపురలో స్థిరపడిన బ్రూ శరణార్థులకు (Bru refugees) కూడా ఓటు హక్కు కల్పించారు. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం (election commission) అధికారులు తెలిపారు. గోమతి, సెపహిజల జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు సీపీఎం కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. ఈ (Tripura polling) ఎన్నికల కోసం మొత్తం 400 కంపెనీల పారా మిలటరీ దళాల సేవలను వాడుకున్నారు.

IPL_Entry_Point