Shirdi temple shutdown : మే 1 నుంచి షిర్డీ సాయి బాబా ఆలయం మూసివేత.. కారణం ఇదే!-shirdi to go into indefinite shutdown starting may 1 over cisf deployment at sai baba temple ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Shirdi Temple Shutdown : మే 1 నుంచి షిర్డీ సాయి బాబా ఆలయం మూసివేత.. కారణం ఇదే!

Shirdi temple shutdown : మే 1 నుంచి షిర్డీ సాయి బాబా ఆలయం మూసివేత.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu
Apr 28, 2023 06:46 AM IST

Shirdi shutdown : మే 1 నుంచి షిర్డీ ఆలయం నిరవధికంగా మూతపడనుంది! ఇందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే..

మే 1 నుంచి షిర్డీ సాయి బాబా ఆలయం మూసివేత.. కారణం ఇదే!
మే 1 నుంచి షిర్డీ సాయి బాబా ఆలయం మూసివేత.. కారణం ఇదే! (Nitin Mirane/ file)

Shirdi shutdown : షిర్డీ సాయి బాబా ఆలయం మే 1 నుంచి మూతపడనుంది! ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్టు మేనేజ్​మెంట్​ ప్రకటించింది. ఆలయ భద్రతకు సీఐఎస్​ఎఫ్​ (సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​)ను మోహరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఆలయాన్ని మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది.

‘మాకు సీఐఎస్​ఎఫ్​ వద్దు..’

పలు మీడియా కథనాల ప్రకారం.. ఆలయ భద్రత నిర్వాహణకు సరిపడా శక్తి సీఐఎస్​ఎఫ్​ వద్ద లేదని మేనేజ్​మెంట్​ భావిస్తోంది. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని మేనేజ్​మెంట్​ వ్యతిరేకిస్తోంది.

Shirdi temple shutdown : మహారాష్ట్ర అహ్మద్​నగర్​లో ఉంది ఈ షిర్డీ ప్రాంతం. సాయి బాబాను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడి వస్తుంటారు. వీదేశీయుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా షిర్డీ.. ఓ పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు తెచ్చుకుంది. అహ్మద్​నగర్​- మన్మాడ్​ హైవేపై ఉండే ఆలయాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్​ ట్రస్ట్​ నిర్వహిస్తోంది. ఆలయ పరిసరాలు, ఉచిత భోజనం, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఛారిటీ స్కూల్స్​- కాలేజీల నిర్వహణ బాధ్యతలు ఈ ట్రస్ట్​ చూస్తూ ఉంటుంది.

ఇదీ చదవండి:- Shirdi Tour: 3 వేల ధరలో షిర్డీ ట్రిప్.. తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ చూడండి

'నాడు షిర్డీ విమానాశ్రయం.. నేడు ఆలయం..'

షిర్డీ విమానాశ్రయ భద్రతా బాధ్యతలను ప్రభుత్వం 2018లోనే సీఐఎస్​ఎఫ్​కు అప్పగించింది. ఇక ఇప్పుడు.. ఆలయంలో భద్రత నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ నిర్ణయం పట్ల ఆలయ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేసింది. షిర్డీ ఆలయంలో భద్రతా పరమైన విషయాలను చూసుకునే విధంగా సీఐఎస్​ఎఫ్​కు ట్రైనింగ్​ ఇవ్వలేదని, అనంతరం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతోంది.

Shirdi temple closed : షిర్డీ సాయి బాబా ఆలయానికి వెళ్లాలని భావిస్తున్న వారు ఈ విషయం పట్ల అప్రమత్తమై ఉండాలి. మే 1 నుంచి ప్రారంభమయ్యే నిరవధిక ఆలయ మూసివేత.. ఎప్పటివరకు కొనసాగుతుందో చెప్పలేము. మరోవైపు ఈలోపు.. ప్రభుత్వం- ఆలయ సిబ్బంది మధ్య చర్చలేవైనా జరిగితే, ఆలయం మూసివేత ఆంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం