Shirdi Tour: 3 వేల ధరలో షిర్డీ ట్రిప్.. తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ చూడండి-telangana tourism announced daily shirdi tour package ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Tourism Announced Daily Shirdi Tour Package

Shirdi Tour: 3 వేల ధరలో షిర్డీ ట్రిప్.. తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ చూడండి

తెలంగామ టూరిజం షిర్డీ టూర్ ప్యాకేజీ
తెలంగామ టూరిజం షిర్డీ టూర్ ప్యాకేజీ (tourism.telangana.gov.in)

Telangana Tourism Latest News: షిర్టీ వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ టూరిజం శాఖ. హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ మేరకు ధరలతో పాటు టూర్ వివరాలను పేర్కొంది.

Telangana Tourism Shirdi Package: సమ్మర్ వచ్చిందంటే చాలు... వేర్వురు సరికొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు పర్యాటకులు..! కొందరు సేద తీరే ప్రాంతాలను ఎంచుకుంటే... మరికొందరు అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లాలని చూస్తారు. అయితే అలాంటి వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ నుంచి ఆపరేట్...

ఈ ప్రత్యేక ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది తెలంగాణ టూరిజం. ఇందుకోసం ఏసీ, నాన్ ఏసీ బ‌స్సుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏసీ బ‌స్సుల్లో అయితే పెద్ద‌ల‌కు రూ. 3,700గా ధరను నిర్ణయించింది. ఇక చిన్నారులకు రూ. 3,010గా నిర్ణ‌యించారు. నాన్ ఏసీ బ‌స్సుల్లో అయితే పెద్ద‌ల‌కు రూ. 2,400, పిల్ల‌ల‌కు రూ. 1,970గా ఉంటుందని తెలిపింది. ఈ ధరలో దర్శనంతో పాటు హోట‌ల్ లో వసతి కూడా కల్పిస్తారు. ఈ ప్ర‌త్యేక ప్యాకేజీతో వెళ్లాల‌కునే వారిని సాయంత్రం స‌మ‌యాల్లో హైద‌రాబాద్‌లోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, బ‌షీర్‌బాగ్‌, ప్యార‌డైస్‌, బేగంపేట్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్ ప్రాంతాల్లో పికప్ చేసుకుంటారు. మ‌రుస‌టి రోజు ఉద‌యం 7 గంటల సమయంలో బస్సులు షిర్డీకి చేరుకుంటాయి. అక్కడ్నుంచి హోటల్ కి చేరుకొని ఫ్రెషఫ్ అవుతారు. అనంతరం షిర్డీ దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న పలు ఆలయాలకు కూడా తీసుకెళ్తారు. అక్కడ్నుంచి సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు. మరునాడు ఉదయం 06.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ లింక్ https://tourism.telangana.gov.in/package/ShirdiTour పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

Toll Free: 1800-425-46464 ఈ నెంబర్ కి కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. info@tstdc.in