Telugu News  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Shirdi Tour From Vijayawada
విజయవాడ షిర్డీ టూర్
విజయవాడ షిర్డీ టూర్ (twitter)

IRCTC Shirdi Tour : 5 వేల ధరతో షిర్డీ ట్రిప్.. విజయవాడ నుంచి తాజా ప్యాకేజీ ఇదే

28 December 2022, 22:25 ISTMahendra Maheshwaram
28 December 2022, 22:25 IST

IRCTC Shirdi Tour From Vijayawada: మీకు షిరిడీ వెళ్లాలని ఉందా? అయితే ఐఆర్‌సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిరిడీకి సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

IRCTC Vijayawada Shirdi Tour: ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి.. ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. తాజాగా విజయవాడ నుంచి షిర్డీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ జనవరి 03వ తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే....

Day - 01: మొదటి రోజు విజయవాడలో స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day - 02: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిరిడీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

Day - 03 : ఇక 3వ రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day 04 Friday: తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ధరల వివరాలు....

కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15,790 ధర ఉండగా... డబుల్ ఆక్యుపెన్సీకి రూ.9910, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8230 చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. కింది జాబితాలో వివరాలను చెక్ చేసుకోవచ్చు.

విజయవాడ షిర్డీ టూర్ ధరలు
విజయవాడ షిర్డీ టూర్ ధరలు (www.irctctourism.com)

NOTE:

టూర్ ను బుకింగ్ చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవచ్చు.