Russia Ukraine war : 75 మిసైళ్లతో ఉక్రెయిన్​పై దాడి.. యుద్ధం మరింత తీవ్రం!-russia ukraine war intensifies as kyiv blames moscow launched 75 missiles ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Russia Ukraine War Intensifies As Kyiv Blames Moscow Launched 75 Missiles

Russia Ukraine war : 75 మిసైళ్లతో ఉక్రెయిన్​పై దాడి.. యుద్ధం మరింత తీవ్రం!

Sharath Chitturi HT Telugu
Oct 10, 2022 02:51 PM IST

Russia Ukraine war latest news : రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మరింత ముదిరింది. ఉక్రెయిన్​పై రష్యా సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనల్లో అనేక మంది మరణించినట్టు తెలుస్తోంది.

రష్యా మిసైల్​ దాడితో కీవ్​ నగరంలో దెబ్బ తిన్న ఓ భవనం
రష్యా మిసైల్​ దాడితో కీవ్​ నగరంలో దెబ్బ తిన్న ఓ భవనం (REUTERS)

Russia latest attacks on Ukraine : క్రిమియా వంతెనపై దాడి ఘటనకు రష్యా ప్రతీకారం తీర్చుకుంది! యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్​ దేశం.. మిసైల్​ దాడులతో అల్లాడిపోయింది. ఉక్రెయిన్​లోని అనేక ప్రాంతాల్లో రష్యా సోమవారం దాడులకు పాల్పడింది. తమపై 75మిసైళ్లతో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్​ ఆరోపిస్తోంది.

"ఉక్రెయిన్​పై మిసైల్​ దాడి జరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేస్తున్నారని సమాచారం ఉంది. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలి. బయటకు రాకూడదు. సోమవారం ఉదయం నుంచి 75మిసైళ్లతో దాడి చేశారు," అని ప్రెసిడెంట్​ ఆఫీసులోని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.

Russia Missile attack on Kyiv : తాజా దాడిలో ఉక్రెయిన్​ రాజధాని కీవ్​ భారీగా దెబ్బతింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు కీవ్​పై దాడులు మొదలయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతాలకు అంబులెన్స్​లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. సోమవారం ఉదయం నుంచి కీవ్​లో ఐదుకుపైగా దాడులు జరిగినట్టు సమాచారం.

<p>కీవ్​పై దాడిలో ధ్వంసమైన వాహనం</p>
కీవ్​పై దాడిలో ధ్వంసమైన వాహనం

జూన్​ 26 తర్వాత..

క్రిమియాను రష్యాను అనుసంధానం చేసే ఓ వంతెనపై రెండు రోజుల క్రితం పేలుడు జరిగింది. ఆ ఘటనలో వంతెన పాక్షికంగా దెబ్బతింది. వాస్తవానికి ఈ వంతెన రష్యాకు ఎంతో అవసరం. కీలకమైన సైనిక రవాణాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వంతెనపై దాడి ఉక్రెయిన్​ పనేనా? అన్నది ఇంకా తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్​పై పగ తీర్చుకుంటామని రష్యా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే.. సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది.

Russia Ukraine war : కీవ్​పై చివరిగా జూన్​ 26న దాడులు జరిపింది రష్యా. ఇప్పుడు మళ్లీ ఈ స్థాయిలో పేలుళ్లు జరుగుతుండటం.. సర్వత్రా భయాందోళనకు కారణమవుతోంది. యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న భయం అందరిలో నెలకొంది.

<p>మిసైల్​ దాడి తర్వాత కీవ్​ నగరం ఇలా..</p>
మిసైల్​ దాడి తర్వాత కీవ్​ నగరం ఇలా..

మరికొన్ని గంటల్లో భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. ఈ తరుణంలో ఉక్రెయిన్​వ్యాప్తంగా దాడులు జరుగుతుండటం చర్చకు దారితీసింది.

ఉక్రెయిన్​లో తాజా దాడులను ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ ఖండించారు. ఉక్రెయిన్​ను భూమి మీద లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

<p>మిసైల్​ దాడిలో గాయపడిన వ్యక్తి..</p>
మిసైల్​ దాడిలో గాయపడిన వ్యక్తి..

"తాజా దాడుల్లో చాలా మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలి. మనల్ని భూమి మీద లేకుండా చేసేందుకు రష్యా కుట్రపన్నుతోంది," అని జెలెన్​స్కీ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

లివ్​, టెర్నోపిల్​, జోటోమిర్​ ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఒక్క కీవ్​లోనే.. దాడుల కారణంగా 8మంది మరణించినట్టు, 24మంది గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం