Mikhail Gorbachev's funeral: గోర్బచెవ్ అంత్యక్రియలకు పుతిన్ అటెండ్ కావడం లేదు!-putin won t attend mikhail gorbachev s funeral kremlin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Putin Won't Attend Mikhail Gorbachev's Funeral: Kremlin

Mikhail Gorbachev's funeral: గోర్బచెవ్ అంత్యక్రియలకు పుతిన్ అటెండ్ కావడం లేదు!

గోర్బచెవ్, పుతిన్
గోర్బచెవ్, పుతిన్

Gorbachev's funeral: సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మైఖేల్ గోర్బచెవ్ అంత్యక్రియల విషయంలో పుతిన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. శనివారం గోర్బచెవ్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, పూర్వ సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా అధికారిక లాంఛనాలు జరగకుండానే ఆయన అంత్యక్రియలు ముగియనున్నాయి.

సోవియట్ యూనియన్ నేత గోర్బచెవ్ అంత్యక్రియల కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొనడం లేదు. తనకన్నా ముందు అధ్యక్షుడిగా ఉన్న బోరిస్ ఎల్త్సిన్ అంత్యక్రియలను పూర్తి స్థాయిలో అధికారిక లాంఛనాలతో ముగించిన పుతిన్.. సోవియట్ యూనియన్ నాయకుడు గోర్బచెవ్ అంత్యక్రియల్లో మాత్రం అధికారిక లాంఛనాలను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నారు. గోర్భచెవ్ అంత్యక్రియల్లో మిలటరీ గౌరవ వందనం ఉంటుంది కానీ ఇతర సంప్రదాయాలు ఉండవని రష్యా అధ్యక్ష భవనం వెల్లడించింది. గోర్బచెవ్ మరణించిన అనంతరం దాదాపు 15 గంటల తరువాతే పుతిన్ సంతాప ప్రకటన వెలువరించడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

Mikhail Gorbachev's funeral: పుతిన్ అటెండ్ కారు..

మాస్కోలోని హాల్ ఆఫ్ కాలమ్స్ లో శనివారం నిర్వహించే బహిరంగ కార్యక్రమం అనంతరం గోర్బచెవ్ ను ఖననం చేస్తారు. అయితే, సోవియట్ యూనియన్ మహా నేతలు వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్, బ్రెజ్నేవ్ తదితరుల చివరి కార్యక్రమాన్ని కూడా మాస్కోలోని హాల్ ఆఫ్ కాలమ్స్ లో నిర్వహించారు. అయితే, శనివారం నిర్వహించే అంత్యక్రియల కార్యక్రమానికి పుతిన్ హాజరు కాబోవడం లేదని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. శనివారం సమయం కుదరడం లేదు కనుక గురువారమే ఆయన గోర్బచెవ్ భౌతిక కాయానికి పుతిన్ నివాళులర్పించారు. రష్యా సంప్రదాయం ప్రకారం తెరచి ఉంచిన గోర్బచెవ్ శవపేటికపై గులాబీ పూలు ఉంచి మౌనం పాటించారు.

Mikhail Gorbachev's funeral: గోర్బచెవ్ పై వ్యతిరేకత

తూర్పు యూరోప్ దేశాలకు స్వతంత్రం లభించడానికి కారణమైన నాయకుడిగా గోర్బచెవ్ ను ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు అభిమాానిస్తాయి కానీ.. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి కారణమైన నేతగా రష్యాలో మెజారిటీ ప్రజలు గోర్బచెవ్ ను వ్యతిరేకిస్తారు. ఆయన ప్రతిపాదించిన పెరిస్త్రోయికా, గ్లాస్ నోస్త్ర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. పుతిన్ సైతం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడాన్ని అతిపెద్ద విపత్తు గా గతంలో అభివర్ణించారు.

WhatsApp channel