Cyclone Mocha news : మోకా తుపానుతో బంగ్లాదేశ్​- మయన్మార్​ తీర ప్రాంతాలు అతలాకుతలం!-powerful cyclone mocha floods homes cuts communications in western myanmar at least 700 injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Powerful Cyclone Mocha Floods Homes, Cuts Communications In Western Myanmar, At Least 700 Injured

Cyclone Mocha news : మోకా తుపానుతో బంగ్లాదేశ్​- మయన్మార్​ తీర ప్రాంతాలు అతలాకుతలం!

మోకా తుపానుతో బంగ్లాదేశ్​- మయన్మార్​ తీర ప్రాంతాలు అతలాకుతలం!
మోకా తుపానుతో బంగ్లాదేశ్​- మయన్మార్​ తీర ప్రాంతాలు అతలాకుతలం! (REUTERS)

Cyclone Mocha news : మోకా తుపాను బీభత్సం సృష్టించింది. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 700మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.

Cyclone Mocha news live : మోకా తుపానుతో బంగ్లాదేశ్​- మయన్మార్​ తీర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తుపాను ధాటికి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది గాయపడ్డారు. కాగా.. తుపాను ప్రభావంపై ఇంకా పూర్తిస్థాయి నివేదిక వెలువడలేదు.

ట్రెండింగ్ వార్తలు

మయన్మార్​లో..

మోకా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్​ కాక్స్​ బజార్​- మయన్మార్​ సిట్వే ప్రాంతాల మధ్య తీరం దాటింది. కాగా.. మయన్మార్​లో పరిస్థితులు దారణంగా ఉన్నాయి. ప్రచండ గాలుల కారణంగా సిట్వే పట్టణంలో.. వివిధ పునారావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 20వేలమందికిపైగా ప్రజల్లో సుమారు 700మంది గాయపడ్డారు. భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చోట్లు నేలకూలాయి. రవాణా వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సెల్​ ఫోన్​ టవర్లు కూలిపోయాయి. ఫలితంగా సమాచార వ్యవస్థ సైతం దెబ్బతింది.

Cyclone Mocha live updates : వేలాది మంది ప్రజలు ప్రస్తుతం వివిధ పునారావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా వారికి కనీస వసతులు కూడా అందుబాటులో లేవని తెలుస్తోంది. టాయిలెట్లు లేక, ఆహారం అందుబాటులో లేక ప్రజలు అల్లాడిపోతున్నట్టు సమాచారం.

"నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత తుపాను ప్రభావం కాస్త తగ్గింది. కానీ ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. వర్షాలు బాగా పడ్డాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. పునరావాస కేంద్రాల్లో చోటు దక్కని ప్రజలు.. తమ ఇళ్లపై కప్పు ఎక్కి రాత్రంతా గడిపారు," అని సహాయక బృందం సభ్యుల్లోని ఒకరు చెప్పారు.

మయన్మార్​లో కూలిన చెట్లు
మయన్మార్​లో కూలిన చెట్లు

Cyclone Mocha death toll : సోమవారం ఉదయం నాటికి పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. తుపాను బలహీన పడింది. వర్షాలు తగ్గాయి. కానీ వరద ప్రాంతాల్లో నీరు ఇంకా అలాగే ఉంది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలను కొనసాగిస్తోంది.

వేరువేరు ప్రాంతాల్లో ఐదుగురు మరణించారని అధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్​లో..

మరోవైపు బంగ్లాదేశ్​పై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాలు నిజం అవ్వలేదు. ఫలితంగా బంగ్లాదేశ్​ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా పలు ప్రాంతాల్లో కొందరు గాయపడినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్​ సరఫరాకు ఆటంకం కలిగింది. విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Cyclone Mocha Bangladesh : కాక్స్​ బజార్​పై తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు.. అక్కడ నివాసముంటున్న వేలాది మంది ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుపాను కారణంగా ఆ ప్రాంతంలో 300లకుపైగా ఇళ్ల ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

మోకా తుపాను ధాటికి ఇలా..
మోకా తుపాను ధాటికి ఇలా..

2008లో..

Cyclone Mocha Myanmar : 2008లో మయన్మార్​లో వచ్చిన తుపాను సృష్టించిన అలజడిని అక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వేరువేరు ఘటనల్లో 1,38,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.