Live news today : జపాన్​లో భారీ భూకంపం.. బంగ్లాదేశ్​లో కూడా..!-live news today 5th may 2023 national and international news in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today : జపాన్​లో భారీ భూకంపం.. బంగ్లాదేశ్​లో కూడా..!

లైవ్​ న్యూస్​ టుడే..(Rahul Singh)

Live news today : జపాన్​లో భారీ భూకంపం.. బంగ్లాదేశ్​లో కూడా..!

03:23 AM ISTMay 05, 2023 09:04 PM Sharath Chitturi
  • Share on Facebook
03:23 AM IST

  • Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్​ వార్తల కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ని ఫాలో అవ్వండి.

Fri, 05 May 202303:34 PM IST

Tata Tiago EV: టాటా టియాగో ఈవీ సూపర్ హిట్.. 4 నెలల్లో 10 వేల సేల్స్

Tata Tiago EV: టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్ కు అద్భుత స్పందన లభిస్తోంది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే 10 వేల టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి.

Fri, 05 May 202309:49 AM IST

Cyclone Mocha: దూసుకొస్తున్న మోచా’ తుపాను; తూర్పు తీరం అప్రమత్తం

Cyclone Mocha: బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తూర్పు తీరం వైపునకు దూసుకువస్తోంది. మే 7 - మే 9 తేదీల మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపానుకు మోచా అనే పేరు పెట్టారు.

Fri, 05 May 202309:17 AM IST

Famous Youtuber dies: 300 కిమీల వేగంతో బైక్ పై స్టంట్స్; యూట్యూబర్ దుర్మరణం

Famous Youtuber dies while racing bike at 300 kpmh: పాపులర్ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో యమున ఎక్స్ ప్రెస్ వే పై బైక్ పై గంటకు 300 కిమీల వేగం (300 kpmh) తో దూసుకువెళ్తూ ప్రమాదానికి గురై, ప్రాణాలు కోల్పోయాడు.

Fri, 05 May 202308:39 AM IST

Kashmir encounter: కశ్మీర్లో ఎన్ కౌంటర్; ఇద్దరు జవాన్ల మృతి

Kashmir encounter: కశ్మీర్లో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు భారతీయ జవాన్లు మృతి చెందారు. నలుగురు జవాన్లు గాయపడ్డారు.

Fri, 05 May 202308:09 AM IST

ది కేరళ స్టోరీ..

వివాదాస్పదంగా మారిన ది కేరళ స్టోరీ విడుదలపై స్టే విధించలేమని కేరళ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సంబంధిత పిటిషన్లను కొట్టివేసింది. రెండు రోజుల క్రితం.. సుప్రీంకోర్టు కూడా.. ఇదే తరహా వ్యాజ్యాలని కొట్టేసింది.

Fri, 05 May 202308:05 AM IST

పేలుడులో ఇద్దరు జవాన్లు మృతి

ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జమ్ముకశ్మీర్​ రజౌరీ సెక్టార్​లోని కండీ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మరో నలుగురు గాయపడినట్టు వివరించారు.

Fri, 05 May 202306:59 AM IST

జపాన్​లో భారీ భూకంపం..

జపాన్​లో భారీ భూకంపం సంభవించింది. ఇషికావా ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే స్థానిక యంత్రాంగం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. 

శుక్రవారం ఉదయం బంగ్లాదేశ్​లోనూ భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై తీవ్రత 4.3గా నమోదైంది.

Fri, 05 May 202306:24 AM IST

శరద్​ పవార్​ రాజీనామా తిరస్కరణ

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ రాజీనామాపై పార్టీ కోర్​ కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఈ విషయంపై చర్చించిన కమిటీ సభ్యులు.. శరద్​ పవార్​ రాజీనామాను తిరస్కరించారు. 

Fri, 05 May 202305:50 AM IST

ఎన్​సీపీ కోర్​ కమిటీ సమావేశం

ముంబైలో ఎన్​సీపీ కోర్​ కిమిటీ సమావేశం ప్రారంభమైంది. శరద్​ పవార్​ రాజీనామా అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

Fri, 05 May 202305:10 AM IST

పాక్​ మంత్రికి స్వాగతం పలికిన జై శంకర్​.

గోవాలో జరుగుతున్న ఎస్​సీఓ విదేశాంగ మంత్రుల కౌన్సిల్​ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్​.. పాక్​ మంత్రి బిలావల్​ భుట్టో జర్గారీకి స్వాగతం పలికారు. 11ఏళ్ల తర్వాత ఓ పాక్​ మంత్రి ఇండియాకు రావడం ఇదే తొలిసారి.

Fri, 05 May 202304:44 AM IST

కర్ణాటక ఎన్నికల సర్వేలు..

2023 కర్ణాటక ఎన్నికలకు ఇంకొన్ని రోజుల సమయమే ఉంది. ఈ క్రమంలో తుది దశ ఎన్నికల ప్రచారాలను మరింత విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వెలువడిన సర్వేలు, అవి చెబుతున్న వివరాలను ఇక్కడ క్లిక్​ చేసి తెలుసుకోండి.

Fri, 05 May 202304:05 AM IST

స్టాక్​ మార్కెట్​ టుడే- లాభాలు.. నష్టాలు..

ఐసీఐసీఐ బ్యాంక్​, నెస్లే, ఇన్ఫీ, టైటాన్​, ఎల్​టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ, ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Fri, 05 May 202303:47 AM IST

నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 377 పాయింట్ల నష్టంతో 61,371 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 84 పాయింట్లు కోల్పోయి 18,172 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Fri, 05 May 202303:36 AM IST

రైలు సేవల నిలిపివేత..

మణిపూర్​లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో నార్త్​ ఈస్టెర్న్​ ఫ్రాంటియర్​ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రైలు సేవలను నిలిపివేసింది. సాధారణ పరిస్థితులు తిరిగొచ్చేంత వరకు రాష్ట్రంలోకి రైళ్లు రావని స్పష్టం చేసింది.

Fri, 05 May 202302:57 AM IST

కాల్పుల కలకలం

సెర్బియాలో కాల్పుల మోత మోగింది. బెల్గ్రేడ్​కు 60.కి.మీల దక్షిణాన ఉన్న మ్లాడెనోవాక్​ ప్రాంతంలో ఆగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13మంది గాయపడ్డారు.

Fri, 05 May 202302:40 AM IST

లండన్​కు జగ్​దీప్​ ధన్​ఖడ్​..

కింగ్​ ఛార్లస్​ పట్టాభిషేకం కోసం లండన్​కు బయలుదేరారు ఉపాధ్యక్షుడు జగ్​దీప్​ ధన్​ఖడ్​. రేపు ఛార్లస్​ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగనుంది.

Fri, 05 May 202302:18 AM IST

ఉగ్రం ట్విట్ట‌ర్ రివ్యూ..

అల్ల‌రి న‌రేష్ హీరోగా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఉగ్రం సినిమా శుక్ర‌వారం (నేడు) థియేట‌ర్ల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Fri, 05 May 202302:16 AM IST

బంగ్లాదేశ్​లో భూకంపం..

బంగ్లాదేశ్​లో శుక్రవారం భూకంపం సంభవించింది. రాజధాని ఢాఖాకు 14కి.మీల ఉత్తరాన భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది.

Fri, 05 May 202302:16 AM IST

బంగారం భగభగ

దేశంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 పెరిగి.. రూ. 57,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 56,500గా ఉండేది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 540 వృద్ధి చెంది.. రూ. 62,180కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,640గా ఉండేది.

దేశంలో వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,710గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 300 పెరిగి 77,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 76,800గా ఉండేది.

Fri, 05 May 202302:16 AM IST

ఎన్​సీపీ కీలక సమావేశం

ఓవైపు శరద్​ పవార్​ తన రాజీనామాను పునరాలోచించుకుంటుంటే.. మరోవైపు అవసరమైతే తదుపరి పార్టీ ప్రెసిడెంట్​ను ఎంపిక చేసే విషయంపై నేడు ఎన్​సీపీ సమావేశం కానుంది! పవార్​ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే.. ఈ రేసులో ముందు ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు పవార్​. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ మద్దతుదారుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.