Cyclone Mocha live updates : తీరం దాటిన మోకా తుపాను.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు-bangladesh myanmar brace as cyclone mocha makes landfall ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Bangladesh, Myanmar Brace As Cyclone Mocha Makes Landfall

Cyclone Mocha live updates : తీరం దాటిన మోకా తుపాను.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

తుపాను నేపథ్యంలో మయన్మార్​లో వర్షాలు..
తుపాను నేపథ్యంలో మయన్మార్​లో వర్షాలు.. (AP)

Cyclone Mocha live updates : మోకా తుపాను తీరాన్ని దాటింది. ఫలితంగా బంగ్లాదేశ్​, మయన్మార్​లో వర్షాలు పడుతున్నాయి.

Cyclone Mocha live updates : బంగ్లాదేశ్​- మయన్మార్​ తీర ప్రాంతాల్లో అలజడి! వారం రోజులుగా భయపెడుతున్న మోకా తుపాను.. బంగ్లాదేశ్​లోని కాక్స్​ బజార్​- ఉత్తర మయన్మార్​లోని​ సిట్వే పట్టణానికి సమీపంలో ఆదివారం తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 195కి.మీల వేగంతో గాలులు వీచినట్టు తెలుస్తోంది. తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

మయన్మార్​లో భారీ వర్షాలు..!

తుపాను నేపథ్యంలో సిట్వే పట్టణంలో ప్రస్తుతం గంటలు 40-48కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా అనేక చెట్లు నేలకూలాయి. విద్యుత్​ స్తంభాలి విరిగపడ్డాయి. విద్యుత్​- రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి.

మయన్మార్​ తీర ప్రాంతం..
మయన్మార్​ తీర ప్రాంతం..

Cyclone Mocha landfall live : మోకా తుపాను నేపథ్యంలో అధికారులు సిట్వే పట్టణంలోని 4వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 20వేల మందిని తమ ఇళ్లను ఖాళీ చేయించి కొండ ప్రాంతాల్లోని స్కూళ్లు, భవనాలకు తీసుకెళ్లారు. అయితే.. వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సరిపడా టాయిలెట్లు లేవని సమాచారం. షెల్టర్లలో ప్రజలకు సరిపడా ఆహారం లేదని అధికారులు చెబుతున్నారు.

బంగ్లాదేశ్​లో ఇలా..

బంగ్లాదేశ్​లోని చాలా ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఎండ ఉంది. కాగా తుపాను ప్రభావిత ప్రాంతమైన కాక్స్​ బజార్​లో వర్షాలు కురుస్తున్నాయి! అయితే.. అధికారులు ఆశించిన స్థాయిలో అతి భారీ వర్షాలు ఇంకా పడలేదు.

మయన్మార్​లో వర్షాలు..
మయన్మార్​లో వర్షాలు..

Bangladesh Mocha cyclone : మరోవైపు మోకా తుపాను నేపథ్యంలో బంగ్లాదేశ్​ ప్రభుత్వం భారీగా సన్నద్ధమైంది. 1,500కుపైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం 21 షిప్స్​, మేరీటైన్​ పాట్రోల్​ ఎయిర్​క్రాఫ్ట్​, హెలికాఫ్టర్ల్​ను సిద్ధం చేసింది.

కాక్స్​ బజార్​లో లక్షలాది మంది రోహింగ్యాలు నివాసముంటున్నారు. వీరందరు శరణార్థులు. వీరికి ఇప్పటికే సరైన వసతులు లేవు. వీరు ఉంటున్న నివాసాల పైకప్పులు అత్యంత బలహీనమైనవి.

పునరావాస కేంద్రాల్లో ఇలా..
పునరావాస కేంద్రాల్లో ఇలా..

భారీ వర్షాలు కురిస్తే.. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా.. చిట్టోగ్రామ్​, కాక్స్​ బజార్​తో పాటు రంగమతి, బందర్​బన్​, ఖగ్రచ్చరిల్లో అలర్ట్​లు జారీ చేసింది.

సంబంధిత కథనం