Cyclone Mocha live updates : మోకా తుపాను మరింత తీవ్రం.. ఈ ప్రాంతాలకు అలర్ట్​!-in pics cyclone mocha to intensify into very severe cyclonic storm today imd ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cyclone Mocha Live Updates : మోకా తుపాను మరింత తీవ్రం.. ఈ ప్రాంతాలకు అలర్ట్​!

Cyclone Mocha live updates : మోకా తుపాను మరింత తీవ్రం.. ఈ ప్రాంతాలకు అలర్ట్​!

Published May 12, 2023 12:43 PM IST Sharath Chitturi
Published May 12, 2023 12:43 PM IST

  • Cyclone Mocha live updates : మోకా తుపాను శుక్రవారం మరింత తీవ్రరూపం దాల్చనుంది. తుపానును ఐఎండీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. అనేకమార్లు హెచ్చరికలు జారీ చేస్తోంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈశాన్య, మధ్య బంగాళాఖాతంలో మోకా తుపాను శుక్రవారం తీవ్ర రూపం దాల్చనుంది. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది. 

(1 / 11)

(AFP)

ఈ నేపథ్యంలో పశ్చిమ్​ బెంగాల్​ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్​డీఆర్​ఎఫ్​కు చెందిన 8 బృందాలను దిఘా ప్రాంతంలో మోహరించింది.

(2 / 11)

మే 14న తుపాను అత్యంత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

(3 / 11)

పశ్చిమ్​ బెంగాల్​ ప్రభుత్వం.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించింది.

(4 / 11)

(File Photo)

బంగాల్​లోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

(5 / 11)

(IMD)

మోకా తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. తాజా అప్డేట్స్​ను అందిస్తున్నట్టు ఐఎండీ శాస్త్రవేత్త సంజీవ్​ ద్వివేదీ తెలిపారు.

(6 / 11)

(ANI)

తుపాను కారణంగా బంగ్లాదేశ్​లోని కాక్స్​ బజార్​ తీర ప్రాంతంలో అలలు 1.5- 2 మీటర్ల ఎత్తు ఎగురుతాయని ఐఎండీ అంచనా వేసింది.

(7 / 11)

తుపాను కారణంగా త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయి.

(8 / 11)

ఆదివారం నాడు మణిపూర్​, దక్షిణ అసోంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

(9 / 11)

తుపానును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

(10 / 11)

కోల్​కతాలోని కంట్రోల్​ రూమ్​ల నుంచి ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను అధికారులు ఈ విధంగా పరిశీలిస్తున్నారు.

(11 / 11)

(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు