Old government vehicles : ఏప్రిల్​ 1 నుంచి పాత ప్రభుత్వ వాహనాలకు గుడ్​ బై!-over 9 lakh government vehicles to go off the indian roads from april 1 2023 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Over 9 Lakh Government Vehicles To Go Off The Indian Roads From April 1 2023

Old government vehicles : ఏప్రిల్​ 1 నుంచి పాత ప్రభుత్వ వాహనాలకు గుడ్​ బై!

Sharath Chitturi HT Telugu
Feb 06, 2023 11:53 AM IST

Old government vehicles scrappage : 15ఏళ్లు పైబడిన వాహనాలను వదిలించుకోవాలని గత కొంతకాలంగా కేంద్రం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా.. కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్​ 1 నుంచి 9లక్షలకుపైగా పాత ప్రభుత్వ వాహనాలు రోడ్డు ఎక్కువని స్పష్టం చేశారు.

పాత ప్రభుత్వ వాహనాలకు గుడ్​ బై చెప్పనున్న కేంద్రం.
పాత ప్రభుత్వ వాహనాలకు గుడ్​ బై చెప్పనున్న కేంద్రం. (File)

Old government vehicles : 15ఏళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాలకు గుడ్​ బై చెప్పేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 15ఏళ్ల పైబడిన ప్రభుత్వ ఆధారిత వాహనాలు.. 2023 ఏప్రిల్​ 1 నుంచి రోడ్డు ఎక్కవని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తాజాగా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

9లక్షల వాహనాలకు గుడ్​బై..!

ఎఫ్​ఐసీసీఐ ఏర్పాటు చేసిన ఈవెంట్​లో సోమవారం పాల్గొన్నారు నతిన్​ గడ్కరీ. ఈ క్రమంలోనే పాత వాహనాలను వదిలించుకునే విషయంపై కీలక వ్యాఖ్యాలు చేశారు.

Old government vehicles scrappage : "9లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలను వదిలించుకునేందుకు ఆమోదాలిచ్చాము. ఇవన్నీ 15ఏళ్లు పైబడిన వాహనాలే. కాలుష్యాన్ని వాపింపజేస్తున్న ఈ బస్సులు, కార్లను ఏప్రిల్​ 1 తర్వాత రోడ్డు ఎక్కనివ్వము. ప్రత్యామ్నాయ ఇంధనంతో కూడిన వాహనాలను కొత్తగా కొనుగోలు చేస్తాము," అని నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. తమ చర్యలతో కాలుష్యం మరింత తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర రోడ్డు రవాణా-హైవే మంత్రిత్వశాఖ నుంచి ఇటీవలే వచ్చిన నోటిఫికేషన్​ ప్రకారం.. 15ఏళ్లు పైబడి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వాహనాలతో పాటు రవాణా సంస్థల వద్ద ఉన్న బస్సులను ఏప్రిల్​ 1 తర్వాత డీ-రిజిస్టర్​ చేసి స్క్రాపింగ్​కు పంపిస్తారు. డిఫెన్స్​, అంతర్గత భద్రత కోసం వినియోగిస్తున్న స్పెషల్​ పర్పస్​ వెహికిల్స్​ వెహికిల్స్​కు మాత్రం ఈ నిబంధన వర్తించదు.

Government scrappage policy : "మోటార్​ వెహికిల్స్​ (రిజిస్ట్రేషన్​ అండ్​ ఫంక్షన్స్​ ఆఫ్​ వెహికిల్​ స్క్రాపింగ్​ ఫెసిలిటీ) 2021 రూల్​కు తగ్గట్టుగా.. రిజిస్టర్డ్​ వెహికిల్​ స్క్రాపింగ్​ కంద్రాలను ఏర్పాటు చేస్తాము. మొదటి రిజిస్ట్రేషన్​ నుంచి 15ఏళ్లు వచ్చిన వాహనాలను అక్కడికి పంపిస్తాము," అని ఆ నోటిఫికేషన్​ పేర్కొంది.

స్క్రాపేజ్​ పాలసీ..

2021-22 బడ్జెట్​లో భాగంగా ఈ స్క్రాపింగ్​ పాలసీని ప్రవేశపెట్టింది కేంద్రం. దీని ప్రకారం పర్సనల్​ వెహికిల్స్​ వయస్సు 20ఏళ్లు మించకూడదు. కమర్షియల్​ వాహనాలకైతే అది 15ఏళ్లే. ఈ కొత్త పాలసీ 2022 ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పాత వాహనాలను వదిలించుకుని కొత్త వెహికిల్​ తీసుకుంటున్న వారికి.. రోడ్​ ట్యాక్స్​లో 25శాతం వరకు రిబేట్​ను ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల పరధిలో ఉంటుందని పేర్కొంది.

Old government vehicles to be scrapped : దేశంలోని ప్రతి నగరానికి 150 కి.మీల దూరంలో కనీసం 1 ఆటోమొబైల్​ స్క్రాపింగ్​ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు.. నితిన్​ గడ్కరీ గతేడాది చెప్పారు. యావత్​ దక్షిణాసియా ప్రాంతానికే.. "వెహికల్​ స్క్రాపింగ్​ హబ్​"గా మారే సామర్థ్యం భారత్​కు ఉందని ఆయన అన్నారు.

IPL_Entry_Point