Monkeypox cases in India : ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​.. దేశంలో 6వ కేసు-nigerian man tests positive for monkeypox 2nd case in delhi 6th countrywide ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nigerian Man Tests Positive For Monkeypox; 2nd Case In Delhi, 6th Countrywide

Monkeypox cases in India : ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​.. దేశంలో 6వ కేసు

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 10:15 PM IST

Monkeypox cases in India : ఢిల్లీలో రెండో మంకీపాక్స్​ కేసు నమోదైంది. ఫలితంగా దేశంలో ఇప్పటివరకు 6 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​
ఢిల్లీలో నైజీరియన్​కు మంకీపాక్స్​ (AFP)

Monkeypox cases in India : దేశంలో మంకీపాక్స్​ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా.. ఢిల్లీలో ఓ 35ఏళ్ల వ్యక్తికి మంకిపాక్స్​ పాజిటివ్​గా తేలింది. ఆయన నైజీరియన్​ దేశస్థుడని సమాచారం. ఫలితంగా ఢిల్లీలో రెండో మంకీపాక్స్​ కేసు వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద దేశంలో ఇది 6వ మంకీపాక్స్​ కేసు.

ట్రెండింగ్ వార్తలు

తాజాగా.. మంకీపాక్స్​ బారిన నైజీరియన్​.. ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణించకపోడంతో ఆయనకు అసలు ఆ వ్యాధి ఎలా సోకింది? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఢిల్లీలోని ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. గత ఐదు రోజులుగా ఆయనకు జ్వరం ఉంది. శరీరంలో బొబ్బలు వచ్చాయి.

ఇటీవలే.. ఆయన రక్తనమూనాను పుణెలోని నేషనల్​ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ వైరాలజీకి తీసుకెళ్లారు. సోమవారం వచ్చిన ఫలితాల్లో ఆయనకు మంకీపాక్స్​ పాజిటివ్​ అని తేలింది.

మరోవైపు.. మంకీపాక్స్​ లక్షణాలతో ఇద్దరు ఆఫ్రికా దేశస్థులు ఇప్పటికే ఎల్​ఎన్​జేపీ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం.

తొలి మరణం..

Monkeypox death in India : దేశంలో శనివారం తొలి మంకీపాక్స్​ మరణం నమోదు కాగా.. సోమవారం దానిని అధికారులు గుర్తించారు. యూఏఈ నుంచి తిరిగొచ్చిన వ్యక్తి.. కేరళ త్రిస్సూర్​లో చికిత్స పొందుతూ శనివారం మరణించినట్టు.. ఆదివారం వార్తలు వచ్చాయి. కాగా.. ఆ వార్తలు నిజమేనని, ఆ వ్యక్తికి మంకీపాక్స్​ సోకిందని.. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్​ సోమవారం ధ్రువీకరించారు.

"జులై 22న.. ఓ యువకుడు యూఏఈ నుంచి కేరళకు తిరిగొచ్చాడు. 26న అతనికి జ్వరం వచ్చింది. ఆ సమయంలో కుటుంబసభ్యులతోనే ఉన్నాడు. 27న ఆసుపత్రిలో చేర్పించారు. 28న.. ఆ యువకుడిని వెంటిలేటర్​ మీద పెట్టారు. 30వ తేదీన ఆతను ప్రాణాలు కోల్పోయాడు. యూఏఈలో జులై 19న అతనికి మంకీపాక్స్​ పరీక్ష నిర్వహించారు. ఆ రిపోర్టుల్లో అతనికి పాజిటివ్​ వచ్చింది," అని వీనా జార్జ్​ వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్