Sonia Gandhi : రాజకీయాల నుంచి సోనియా గాంధీ రిటైర్మెంట్ తీసుకోనున్నారా?
Congress plenary session Sonia Gandhi : భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్‌ను ముగిస్తుండటం సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ. ఈ నేపథ్యంలో ఆమె రిటైర్మెంట్పై ఊహాగానాలు జోరందుకున్నాయి.
Congress plenary session Sonia Gandhi : గత నెలతో ముగిసిన భారత జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ ముగిసిందన్న సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, పార్టీ కీలక నేత సోనియా గాంధీ. భారత్ జోడో యాత్రను.. పార్టీ చరిత్రలోనే ఓ కీలక మలుపుగా అభివర్ణించారు.

కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు..
ఛత్తీస్‌గఢ్ రాజధానీ రాయ్‌పూర్‌లో మూడు రోజుల కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం మొదలయ్యాయి. రెండో రోజు కార్యకలాపాల్లో భాగంగా 15వేల మంది పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు సోనియా గాంధీ.
Sonia Gandhi retirement : "భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసే అవకాశం ఉంది. ఇది నాకు సంతోషాన్నిచ్చే విషయం. భారత్ జోడో యాత్ర.. పార్టీకి టర్నింగ్ పాయింట్. దేశంలో శాంతి, సామరస్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రుజువైంది," అని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
Sonia Gandhi Bharat Jodo Yatra : మరోవైపు.. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 85వ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. భారత్ జోడో యాత్ర విజయవంతమైన తరుణంలో ఈ ప్లీనరీ సమావేశాలకు ప్రాధాన్యత మరింత పెరిగాయి. వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ రచించాల్సిన వ్యూహాలు.. ఇతర పార్టీలతో పొత్తులు వంటి వాటిపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
Congress plenary session Raipur : సమావేశాల తొలి రోజులో భాగంగా.. పాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ సభ్యులు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించకూడదని అంగీకారానికి ఒచ్చారు. సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు.