Cylinder Blast: బెలూన్ లో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్... చిన్నారి మృతి-maha 2 yr old girl killed in gas cylinder blast while inflating balloon ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maha: 2-yr-old Girl Killed In Gas Cylinder Blast While Inflating Balloon

Cylinder Blast: బెలూన్ లో గ్యాస్ నింపుతుండగా పేలిన సిలిండర్... చిన్నారి మృతి

Mahendra Maheshwaram HT Telugu
Aug 28, 2022 01:18 PM IST

Maharashtra Gas Cyclinder Blast: మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ఓ పండగలో రెండేళ్ల చిన్నారి బెలూన్లు కొనే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందింది.

గ్యాస్ సిలిండర్ పేలి చిన్నారి మృతి
గ్యాస్ సిలిండర్ పేలి చిన్నారి మృతి

2 yr old girl killed in gas cylinder blast: మహారాష్ట్రలో విషాద ఘటన వెలుగు చూసింది. స్థానికంగా జరుగుతున్న ఓ జాతరకు వెళ్లిన చిన్నారి గ్యాస్ పేలి ప్రాణం కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు

పోలీసుల వివరాల ప్రకారం...

బెలూన్ లో గ్యాస్ నింపుతుండగా సిలిండర్ పేలి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన శనివారం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షిండి గ్రామంలో జరిగింది. రెండేళ్ల చిన్నారి తన తాతతో కలిసి పొలా పండగలో భాగంగా స్థానికంగా జరుపుతున్న ఓ జాతరకు వెళ్లారు.

స్థానికంగా జరుగుతున్న జాతరలో బెలూన్లు అమ్ముతుండగా చిన్నారికి ఇప్పించేందుకు తాత అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆ బెలూన్ లో గ్యాస్ నింపుతుండగా సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో రెండేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పొలా పండగ ఏంటి..?

Tanha Pola festival: మహారాష్ట్రలో పొలా అనేది సంప్రదాయంగా నిర్వహించే వేడుక. ఏడాదికోసారి పుట్టింటిబిడ్డల చేతులతో కృతజ్ఞతగా ఎద్దులకు నైవేద్యం తినిపించే ఈ వేడుక కోసం ఊరువాడ ఆశగా ఎదురుచూస్తుంది. రాత్రిపూట ఎద్దుల మెడ, మూపురంపై ప్రేమతో పసుపురాస్తారు. వాటిపై ప్రేమను చాటుతూ కడుపునిండా పచ్చని గడ్డిని వేస్తారు.

Tanha Pola festival importance: ప్రతి ఎద్దును శుభ్రంగా కడుగుతారు. తరువాత కొమ్ములకు రంగురంగుల కాగితాలు, ప్రత్యేకంగా తయారుచేసే కుచ్చులు, మెడలో గంటలు, కాళ్లకు గజ్జలు... ఒంటిపై కొత్తగా చేయించిన జూళ్లుతో అలంకరిస్తారు. ఊరంతా ఒక్కసారిగా పార్వతీ పతి హరహర మహాదేవా... శంభోశంకర అంటూ నినాదాలు చేస్తూ ముందుగా గ్రామదేవతల ఆలయాల చుట్టూ తిప్పుతూ ఊరిచివరన ఒకచోట గుంపుగా చేరుస్తారు. అక్కడ గ్రామ పెద్ద ప్రతి ఎద్దును పసుపు, కుంకుమ, బిల్వపత్రాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. తర్వాత డప్పులు, భాజభజంత్రీలతో ఊరేగిస్తూ గ్రామ హనుమాన్‌ ఆలయం చుట్టూ తిప్పుతారు. పొలాల పండగ వస్తుందంటే చాలు నెలరోజుల ముందునుంచే ప్రతి ఇంటా సంబురం నెలకొంటుంది.

IPL_Entry_Point