Live news today : ఈ ఏడాది సాధారణ వర్షపాతం- ఐఎండీ-live news today 26th may 2023 national international business updates
Telugu News  /  National International  /  Live News Today 26th May 2023 National International Business Updates

హెచ్​టీ తెలుగు లైవ్​ బ్లాగ్​.(HT_PRINT)

Live news today : ఈ ఏడాది సాధారణ వర్షపాతం- ఐఎండీ

Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్​ వార్తల లైవ్​ అప్డేట్స్​ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

Fri, 26 May 20239:09 IST

సాధారణ వర్షపాతం..

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పునరుద్ఘాటించింది. ఎల్​నీనో భయాల మధ్య ఐఎండీ ప్రకటన కాస్త ఉపశమనాన్ని కలిగించే విషయమే. ఈ దఫా నైరుతి రుతుపవనాలు జూన్​ 4కు అటు, ఇటుగా కేరళను తాకుతాయని ఐఎండీ పేర్కొంది.

Fri, 26 May 20238:49 IST

మనిషిపై 40 మొసళ్లు అటాక్​..

కంబోడియాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మనిషిపై ఏకకాలంలో 40 మొసళ్లు దాడి చేశాయి. అతని చెయ్యి పీక్కుని మింగేశాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తి మరణించాడు.

Fri, 26 May 20238:24 IST

తిరిగొచ్చిన విమానం..

ఎయిర్​ ఇండియా ఫ్లైట్​ ఏ1185.. ఢిల్లీ నుంచి వాన్​కోవర్​కు బయలుదేరిన కొన్ని నిమిషాలకే తిరిగొచ్చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్​ అయ్యింది.

Fri, 26 May 20237:59 IST

పార్లమెంట్​ భవనంపై పిటిషన్​ కొట్టివేత..

పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవంపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసింది. భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు పిటిషనర్​.

Fri, 26 May 20237:21 IST

బోనాల ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష..

  • జూన్ 22 నుంచి ఆషాడ బోనాలు
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేట లోని హరిత ప్లాజా లో బోనాల ఏర్పాట్లపై ప్రారంభమైన ఉన్నతస్థాయి సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, CS శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు
  • జూన్ 22 న గోల్కొండ లో ఆషాడ బోనాలు ప్రారంభం
  • జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10 రంగం
  • 16 న ఓల్డ్ సిటీ బోనాలు, 17 న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు

Fri, 26 May 20236:42 IST

హ్యుందాయ్​ ఎక్స్​టర్​..

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. జులై 10న ఇండియాలో ఈ ఎస్​యూవీ లాంచ్​ అవుతుందని సంస్థ చెప్పింది.

Fri, 26 May 20236:33 IST

సత్యేందర్​ జైన్​కు బెయిల్​..

దిల్లీ జైలులో ఉంటున్న మాజీ మంత్రి, ఆప్​ నేత సత్యేందర్​ జైన్​కు ఆరు వారాల మధ్యంతర బెయిల్​ లభించింది. వైద్య పరిస్థితుల నేపథ్యంలో బెయిల్​ ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. తిహార్​ జైలు బాత్​రూమ్​లో పడిపోయిన జైన్​ను అధికారులు గురువారం దిల్లీలోని ఆసుపత్రికి తరలించారు.

Fri, 26 May 20235:56 IST

బ్యాంక్​ సెలవులు..

మే నెల ముగింపు దశకు చేరుకుంది. బ్యాంక్​లు మే నెలలో 2 రోజుల పాటు సెలవు తీసుకున్నాయి. జూన్​లోనూ 12 రోజులు సెలవు తీసుకోనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Fri, 26 May 20235:30 IST

వాట్సాప్​లో యూజర్​ నేమ్స్​..

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​లో కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. ‘యూజర్​ నేమ్​’ను వాట్సాప్​ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇన్​స్టాగ్రామ్​లో ఉండే విధంగా ఇక వాట్సాప్​లోనూ ఫోన్​ నెంబర్లతో కాకుండా.. యూజర్​నేమ్​తో అకౌంట్స్​ ఉంటాయని తెలుస్తోంది.

Fri, 26 May 20235:00 IST

ఐడీబీఐలో ఉద్యోగాలు..

గ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఐడీబీఐ బ్యాంక్​ (ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూన్​ 7తో అప్లికేషన్​ ప్రక్రియ ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Fri, 26 May 20234:43 IST

స్టాక్​ మార్కెట్​లు.. లాభాలు.. నష్టాలు..

రిలయన్స్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, టెక్​ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, యాక్సిస్​బ్యాంక్​, పవర్​గ్రిడ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Fri, 26 May 20234:21 IST

అమెరికా రక్షణమంత్రి ఇండియా పర్యటన..

అమెరికా రక్షణశాఖ మంత్రి ఆస్టిన్​.. ఇండియాలో పర్యటించనున్నారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా వచ్చే వారం ఇండియాలో దిగుతారు.

Fri, 26 May 20233:47 IST

లాభాల్లో స్టాక్​ మార్కెట్​లు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 107 పాయింట్లు పెరిగి 61,981 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 30 పాయింట్లు వృద్ధిచెంది 18,351 వద్ద ట్రేడ్​ అవుతోంది.

Fri, 26 May 20233:46 IST

మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత..

ఫేస్​బుక్​ సంస్థ మెటా.. మళ్లీ జాబ్​ కట్స్​ తీసుకుంది! సంస్థకు చెందిన బిజినెస్​, ఆపరేషన్స్​ విభాగంలోని కొంతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు తెలుస్తోంది. 10వేలకుపైగా ఉద్యోగాలను కట్​ చేస్తున్నట్టు సంస్థ మార్చ్​లోనే వెల్లడించింది.

Fri, 26 May 20233:08 IST

ఏపీలో మండనున్న ఎండలు..

రోహిణి కార్తెలో ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నా, నేటి నుంచి వాటి తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో తేలిక పాటి వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు

Fri, 26 May 20232:50 IST

రూ. 75 కాయిన్​ లాంచ్

నూతన పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్​ భవనం ఓపెనింగ్​ను ఉద్దేశించి.. రూ. 75 కాయిన్​ను లాంచ్​ చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Fri, 26 May 20232:49 IST

పసిడి, వెండి ధరలు..

దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 450 దిగొచ్చి.. రూ. 55,800కి చేరింది. దేశంలో వెండి ధరలు శుక్రవారం భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,305గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 1000 పతనమై.. రూ. 73,050కి చేరింది. 

Fri, 26 May 20232:49 IST

ఇండియా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో దాదాపుగా నష్టాల్లో ట్రేడ్​ అయిన స్టాక్​ మార్కెట్​లు.. చివరి సెషన్​లో భారీగా పుంజుకున్నాయి. చివరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 98 పాయింట్ల లాభంతో 61,873 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 18,321 వద్ద స్థిరపడింది.

Fri, 26 May 20232:50 IST

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

ఆర్టికల్ షేర్ చేయండి