Bank holidays in June : జూన్​లో బ్యాంక్​లకు 12 రోజులు సెలవులు.. వివరాలివే-list of bank holidays in june 2023 check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays In June : జూన్​లో బ్యాంక్​లకు 12 రోజులు సెలవులు.. వివరాలివే

Bank holidays in June : జూన్​లో బ్యాంక్​లకు 12 రోజులు సెలవులు.. వివరాలివే

Sharath Chitturi HT Telugu
May 26, 2023 11:25 AM IST

Bank holidays in June : వచ్చే నెలలో బ్యాంక్​లకు 12రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

జూన్​లో బ్యాంక్​లకు 12 రోజులు సెలవులు
జూన్​లో బ్యాంక్​లకు 12 రోజులు సెలవులు

Bank holidays in June : మే నెల ముగింపు దశకు చేరుకుంది. బ్యాంక్​లు మే నెలలో 2 రోజుల పాటు సెలవు తీసుకున్నాయి. జూన్​లోనూ 12 రోజులు సెలవు తీసుకోనున్నాయి! జూన్​​ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్​ను ఆర్​బీఐ ఇటీవలే విడుదల చేసింది. బ్యాంకు పనుల కోసం తిరిగే వారు.. సెలవుల లిస్ట్​ను చూడటం ఎంతో ముఖ్యం. సెలవుల బట్టి మీ పనిని ప్లాన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్​లో బ్యాంక్​ సెలవుల వివరాలు..

2023 జూన్​ 4:- ఆదివారం

2023 జూన్​ 10:- రెండో శనివారం

2023 జూన్​ 11:- ఆదివారం

2023 జూన్​ 15:- రాజ సంక్రాంతి. మిజోరాం, ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

2023 జూన్​ 18:- ఆదివారం

2023లో బ్యాంక్​ సెలవుల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2023 జూన్​ 20:- రథ యాత్ర. ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

2023 జూన్​ 24:- నాలుగో శనివారం

2023 జూన్​ 25:- ఆదివారం

2023 జూన్​ 26:- ఖార్చి పూజ, త్రిపురలో బ్యాంక్​లకు సెలవు.

2023 జూన్​ 28:- ఈద్​ ఇల్​ అజ్వా. కేరళ, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్​లోని బ్యాంక్​లకు సెలవు.

2023 జూన్​ 29:- ఈద్​ ఇల్​ అజ్వా, ఇతర రాష్ట్రాల్లోని బ్యాంక్​లకు సెలవు ఉండొచ్చు.

2023 జూన్​ 30:- రీమా ఈద్​ ఇల్​ అజ్వా, మిజోరాం- ఒడిశాలోని బ్యాంక్​లకు సెలవు.

మే నెలలో..

మే నెలలో తెలుగు రాష్ట్రాలు 7 రోజుల మూతపడి ఉంటాయి. మే 1న కార్మిక దినోత్సవంతో పాటు ఆది, రెండు- నాలుగు శనివారాలు సెలవులు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్​ నెలలో బ్యాంక్​లు 15 రోజులు సెలవులు తీసుకున్నాయి.

బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు. వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో నగదు జమ చేసుకోవచ్చు. అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవుల గురించి సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు ఉండవు.

సంబంధిత కథనం