75 rupee coin to launch soon : త్వరలోనే రూ. 75 కాయిన్ లాంచ్..
75 rupee coin to launch soon : త్వరలోనే రూ. 75 కాయిన్ లాంచ్ అవ్వనుంది. ఈ విషయం కేంద్రం వెల్లడించింది.
75 rupee coin to launch soon : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తలపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్‌ను ఉద్దేశించి.. రూ. 75 కాయిన్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. ఈ రూ. 75 కాయిన్ త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
75 రూపాయిలు విలువ చేసే ఈ నాణెం బరువు 35గ్రాములు. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్‌తో దీనిని తయారు చేయనున్నారు. దీని డయామిటర్ (వ్యాసం) 44ఎంఎంలు.
RS 75 coin : కాగా.. ఈ కాయిన్ డిజైన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం ఇందులో ఉండనుంది. ఈ లయన్ క్యాపిటల్ కింద 'సత్యమేవ జయతే' అని రాసి ఉంటుంది. ఎడమవైపు.. 'భారత్' అన్న పదం దేవనగరి లీపిలో రాసి ఉంటుందని తెలుస్తోంది. కుడివైపు ఆంగ్లంలో 'ఇండియా' అని రాసి ఉండనుంది. కాగా.. ఈ కాయిన్‌పై రూపీ సింబల్‌తో పాటు డినామినేషన్ వాల్యూగా 75 ఉండనుంది. లయన్ క్యాపిటల్ కింద ఇవి ఉండనున్నాయి. కాయిన్ ఎగువ అంచుపై 'సంసద్ సంకుల్' అని దేవనగరి స్క్రిప్ట్‌లో, దిగువ అంచున 'పార్లమెంట్ కాంప్లెక్స్' ఉండనున్నాయి.
ఈ రూ. 75 విలువ చేసే నాణేనికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత సమాచారం తెలుస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో రూ. 1, రూ. 2, రూ. 5 విలువ చేసే కాయిన్లు ఎక్కువగా వాడకంలో ఉన్నాయి. గతంలో రూ. 10ని ఆర్బీఐ లాంచ్ చేసినప్పటికీ.. వాటి వాడకం తగ్గిపోయింది!
నూతన పార్లమెంట్ భవనం..
New Parliament building opening : ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ వేడుకకు 25పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో 20 విపక్ష పార్టీలు ఈ వేడుకలను బహిష్కరించాయి. ఈ వ్యవహారంపై ఎన్డీఏ- విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడమేంటి? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వేడుకులను బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఎన్డీఏ పక్షాలు మండిపడుతున్నాయి.
సంబంధిత కథనం