IDBI Bank Recruitment 2023 : ఐడీబీఐ బ్యాంక్​లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి!-idbi bank recruitment 2023 apply online for 1036 executive posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Idbi Bank Recruitment 2023 : ఐడీబీఐ బ్యాంక్​లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి!

IDBI Bank Recruitment 2023 : ఐడీబీఐ బ్యాంక్​లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి!

Sharath Chitturi HT Telugu
May 26, 2023 10:13 AM IST

IDBI Bank Recruitment 2023 : 1000కిపైగా ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది ఐడీబీఐ బ్యాంక్​. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

ఐడీబీఐ బ్యాంక్​లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి!
ఐడీబీఐ బ్యాంక్​లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి! (REUTERS)

IDBI Bank Recruitment 2023 : ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్​ను విడుదల చేసింది ఐడీబీఐ బ్యాంక్​ (ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). అప్లికేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జూన్​ 7తో అప్లికేషన్​ ప్రక్రియ ముగియనుంది. అభ్యర్థులు తమ అపిక్లేషన్లను ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్​లోని ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఐడీబీఐ బ్యాంక్​ రిక్రూట్​మెంట్​ 2023-

మొత్తం వేకెన్సీలు- 1036 ఎగ్జిక్యూటివ్​ పోస్టులు

ఎస్​సీ- 160

ఎస్​టీ- 67

ఓబీసీ- 255

ఈడబ్ల్యూఎస్​-103

అన్​రిజర్వ్​డ్​- 451

విద్యార్హత- అభ్యర్థులు.. ఏదైనా అనుమతి పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి.

వయస్సు పరిమితి- అభ్యర్థుల కనిష్ఠ వయస్సు 20ఏళ్లు. గరిష్ఠంగా.. 2023 మే 1 నాటికి 25ఏళ్లు నిండి ఉండాలి.

ఐడీబీఐ బ్యాంక్​ పరీక్ష వివరాలు..

IDBI Bank Recruitment apply online : ముందుగా ఆన్​లైన్​ పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైన వారి డాక్యుమెంట్లను వెరిఫై చేస్తారు. అనంతరం ప్రీ రిక్రూట్​మెంట్​ మెడికల్​ ఎగ్జామినేషన్​ నిర్వహిస్తారు.

కీలకమైన తేదీలు..

ఐడీబీఐ బ్యాంక్​ నోటిఫికేషన్​ ప్రకారం.. అప్లికేషన్​ ప్రక్రియ మే 24న మొదలై.. జూన్​ 7తో ముగుస్తుంది. అప్లికేషన్​లను జూన్​7లోపు ఎడిట్​ చేసుకోవచ్చు. జూలై 2న ఆన్​లైన్​ పరీక్ష ఉంటుంది.

అప్లికేషన్​ ఫీజు..

ఎస్​సీ/ఎస్​టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి.

ఇతరులు రూ. 1000 చెల్లించాలి.

ఐడీబీఐ బ్యాంక్​లో ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- ఐడీబీఐ బ్యాంక్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో 'కేరీర్స్​' సెక్షన్​లోకి వెళ్లండి. 'కరెంట్​ ఓపెనింగ్స్​'పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- 'రిక్రూట్​మెంట్​ ఆఫ్​ ఎగ్జిక్యూటివ్స్​ ఆన్​ కాంట్రాక్ట్​-2023'పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- అప్లై ఆన్​లైన్​ ఆప్షన్​ ఎంచుకోండి.

స్టెప్​ 5:- అప్లికేషన్​ ఫామ్​ను ఫిల్​ చేయండి.

స్టెప్​ 6:- ఫొటోగ్రాఫ్​, సిగ్నేచర్​, థంబ్​ ఇంప్రెషన్​, చేతితో రాసిన డిక్లరేషన్​ వంటివి సమర్పించండి.

స్టెప్​ 7:- అప్లికేషన్​ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 8:- మీ వివరాలను మరోసారి సరిగ్గా చెక్​ చేసుకుని ఫామ్​ను సబ్మీట్​ చేయండి.

ఈ దఫా ఉద్యోగాలు కాంట్రాక్ట్​ బేసిస్​పై తీసుకోనున్నట్టు బ్యాంక్​ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

ఎస్​బీఈ రిక్రూట్​మెంట్ 2023..

SBI recruitment 2023 : స్పెషలిస్ట్​ క్యాడర్​ ఆఫీర్స్​కు చెందిన వివిధ రెగ్యూలర్​, కాంట్రాక్ట్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. డేటా, టెక్​, టెస్టింగ్​తో పాటు ఇతర విభాగాల్లోని అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​, చీఫ్​ మేనేజర్​, ప్రాజెక్ట్​ మేనేజర్​ వంటి పోస్టులను ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భర్తీ చేయనుంది ఎస్​బీఐ. ఈ మేరకు అప్లికేషన్​ ప్రక్రియ ఈ నెల 16నే మొదలైపోయింది. జూన్​ 5తో అప్లికేషన్​ గడువు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను bank.sbi/careers లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం