July WPI inflation: 13.93 శాతానికి తగ్గిన హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం-july wpi inflation eases to 13 93 percent government of india announces ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  July Wpi Inflation Eases To 13.93 Percent Government Of India Announces

July WPI inflation: 13.93 శాతానికి తగ్గిన హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం

Praveen Kumar Lenkala HT Telugu
Aug 16, 2022 12:58 PM IST

India's July WPI inflation: జూలైలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్భణం 13.93 శాతానికి తగ్గింది.

జూలై మాసంలో హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.18 శాతం నుంచి 13.93 శాతానికి తగ్గినట్టు వెల్లడించిన ప్రభుత్వం
జూలై మాసంలో హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 15.18 శాతం నుంచి 13.93 శాతానికి తగ్గినట్టు వెల్లడించిన ప్రభుత్వం (Bloomberg)

July WPI inflation: దేశ ఆర్థిక వ్యవస్థకు స్వల్ప ఊరట కలిగించే వార్త ఇది. దేశంలో జూలై మాసంలో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్భణం 13.93 శాతానికి తగ్గింది. జూన్ నెలలో ఇది 15.18 శాతంగా ఉంది. ఈమేరకు ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది.

రాయిటర్స్ విశ్లేషకుల పోల్ అంచనాల్లో ఇది 14.20 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అంతకంటే కూడా తక్కువగా హోల్ సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం నమోదైంది.

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (WPI inflation) మే నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి పెరిగింది. జూన్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మూడు నెలలుగా పెరుగుతున్న ట్రెండ్‌ను నిలిపివేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన పెరుగుదల.. వరుసగా 16వ నెలలో కూడా రెండంకెల స్థాయిలోనే హోల్‌సేల్ ప్రైస్ ఆధారిత ద్రవ్యోల్భణం పెరుగుతోంది.

మానిటరీ పాలసీ రూపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తుంది.

IPL_Entry_Point

టాపిక్