New year celebrations in India : దేశంలో న్యూ ఇయర్​ వేడుకలు.. ‘తగ్గేదే లే!’-india welcomes new year 2023 with fanfare ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  India Welcomes New Year 2023 With Fanfare

New year celebrations in India : దేశంలో న్యూ ఇయర్​ వేడుకలు.. ‘తగ్గేదే లే!’

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 01, 2023 07:20 AM IST

India New Year celebrations 2023 : దేశవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు, సంబరాలు అంబరాన్ని తాకాయి! ప్రజలు ఎంతో ఉత్సాహంగా 2023కు స్వాగతం పలికారు.

2023కు ఘన స్వాగతం పలికిన భారతీయులు..
2023కు ఘన స్వాగతం పలికిన భారతీయులు.. (AP)

India New Year celebrations 2023 : దేశవ్యాప్తంగా 2023 న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన ఏడాదికి టపాసులు, మ్యూజిక్​, స్టెప్పులతో స్వాగతం పలికారు భారతీయులు. ఈ నూతన ఏడాది అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ప్రార్థనలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో.. సంబరాలు అంబరాన్ని తాకే విధంగా జరిగాయి. ఢిల్లీ నుంచి ముంబై వరకు.. చెన్నై నుంచి కోల్​కతా వరకు 'తగ్గేదే లే!' అన్న రీతిలో 2023 న్యూ ఇయర్​ వేడుకలు జరుపుకున్నారు ప్రజలు.

ఢిల్లీలో అలా.. ముంబైలో ఇలా..

Delhi New Year Celebrations : ఢిల్లీలో శనివారం రాత్రి 9-10 గంటల నుంచి న్యూ ఇయర్​ వైబ్స్​ మొదలయ్యాయి. పబ్స్​, క్లబ్స్​ అన్ని యువతతో కళకళలాడిపోయాయి. ప్రత్యేక పార్టీలతో వీధులన్నీ మెరిసిపోయాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో.. ప్రజలు భారీ సంఖ్యల్లో గుమిగూడి.. చిందులేశారు.

ప్రపంచవ్యాప్తంగా.. ఘనంగా న్యూ ఇయర్​ వేడుకలు- పిక్స్​ చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ముంబైలో న్యూ ఇయర్​ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన ఏడాది వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలతో.. మెరైన్​ డ్రైవ్​ కిటకిటలాడిపోయింది​. మ్యూజిక్​తో పబ్స్​ దద్దరిల్లిపోయాయి.

గోవా.. గోవా.. గోవా..

New Year celebrations in Goa : గోవాలో న్యూ ఇయర్​ వేడుకలు జరుపుకోవాలని చాలా మంది కలలు కంటారు. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా అంచనాలకు మించి.. గోవాలో వేడుకలు జరిగాయి. హోటల్స్​, రిసార్ట్స్​, పబ్స్​లో.. న్యూ ఇయర్​ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ బీచ్​లలో ప్రజలు రాత్రిని గడిపారు.

ఇక కేరళ కొచ్చిలోని కొచ్చి ఫోర్ట్​లో టపాసులు పేలాయి. దీప కాంతులతో న్యూ ఇయర్​ వేడుకలు చేసుకున్నారు ప్రజలు. మరోవైపు న్యూ ఇయర్​ సందర్భంగా.. ఒడిశా పూరీ తీరాన.. 8 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవైన జగన్నాథుడి సైకత శిల్పాన్ని వేశారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​.

బెంగళూరులో లాఠీ ఛార్జ్​..!

బెంగళూరు న్యూ ఇయర్​ వేడుకల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ ప్రాంతంలో ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి వేడుకలు చేసుకున్నారు. ఈ క్రమంలో క్రౌడ్​ను నియంత్రించేందుకు.. అక్కడి పోలీసులు ప్రజలపై లాఠీ ఛార్జ్​ చేశారు. ఈ ఘటన మినహా.. కర్ణాటక వ్యాప్తంగా.. నూతన ఏడాది సంబరాలు ప్రశాంతంగా జరిగాయి.

New Year celebrations in Hyderabad : ఇక ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో.. న్యూ ఇయర్​ వేడుకలను మ్యూజిక్​తో స్వాగతం పలికారు ప్రజలు. మ్యూజికల్​ నైట్​ పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. ఇళ్లల్లో.. ప్రజలు కేక్​లు కట్​ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.

పూజలు.. అభిషేకాలు..

న్యూ ఇయర్​ సందర్భంగా.. ప్రజలు ఆదివారం తెల్లవారుజామున నుంచే వివిధ ఆలయాలకు తరలివెళుతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నూతన ఏడాది తొలి రోజు సందర్భంగా.. ఉజ్జెయిన్​ మహాకాళేశ్వర్​ ఆలయంలో ‘భస్మారతి’ నిర్వహించారు.

ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో హారతి కార్యక్రమం జరిగింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం