ICAI CA May 2023 Time Table: సీఏ మే ఎగ్జామ్ 2023 డేట్స్ ఇవే.. బీ ప్రిపేర్డ్-icai ca may exam 2023 time table foundation inter final course dates out ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Icai Ca May Exam 2023 Time Table: Foundation, Inter &Amp; Final Course Dates Out

ICAI CA May 2023 Time Table: సీఏ మే ఎగ్జామ్ 2023 డేట్స్ ఇవే.. బీ ప్రిపేర్డ్

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 05:49 PM IST

ICAI CA May 2023 Time Table: ఐసీఏఐ సీఏ మే ఎగ్జామ్ 2023 (ICAI CA May Exam 2023) టైమ్ టేబుల్ విడుదల అయింది. ఐసీఏఐ ఫౌండేషన్(foundation), ఇంటర్ (inter), ఫైనల్ (final) కోర్సుల పరీక్షల వివరాలను చెక్ చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ICAI CA May 2023 Time Table: ఈ సంవత్సరం మే నెలలో జరిగే సీఏ(CA) ఫౌండేషన్(foundation), ఇంటర్ (inter), ఫైనల్ (final) కోర్సుల పరీక్షల టైమ్ టేబుల్ ను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (Institute of Chartered Accountants of India ICAI) జనవరి 10, 2023న విడుదల చేసింది.

ICAI CA May 2023 Time Table: అధికారిక వెబ్ సైట్లో..

సీఏ(CA) ఫౌండేషన్(foundation), ఇంటర్ (inter), ఫైనల్ (final) కోర్సుల పరీక్షల టైమ్ టేబుల్ ను ICAI విడుదల చేసింది. ICAI అధికారిక వెబ్ సైట్ icai.org లో ఈ పరీక్షల తేదీలను చెక్ చేసుకోవచ్చు.

ICAI CA May 2023 Time Table: ఈ తేదీల్లోనే..

సీఏ(CA) ఫౌండేషన్ కోర్సు (foundation course) పరీక్షలను 2023 జూన్ 24, 26, 28, 30 తేదీల్లో నిర్వహించాలని ICAI నిర్ణయించింది. అలాగే, సీఏ(CA) ఇంటర్మీడియెట్ కోర్సు గ్రూప్ 1 ( CA Inter Group 1) పరీక్షలను 2023 మే 3, 6, 8, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ కోర్సు గ్రూప్ 2 ( CA Inter Group 2) పరీక్షలను 2023 మే 12, 14, 16, 18 తేదీల్లో నిర్వహిస్తారు. సీఏ ఫైనల్ గ్రూప్ 1 ( CA Group 1 final course exam) పరీక్షలు 2023 మే 2, 4,7, 9 తేదీల్లో ఉంటాయి. సీఏ ఫైనల్ గ్రూప్ 1 ( CA Group 1 final course exam) పరీక్షలను మే 11, 13, 15, 17 తేదీల్లో ఉంటాయి. సీఏ ఫౌండేషన్ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, ఇంటర్ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు , ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతీ పరీక్షకు ముందు 15 నిమిషాల పాటు (మధ్యాహ్నం 1.45 నుంచి 2 వరకు) అడ్వాన్స్ రీడింగ్ టైమ్ ఇస్తారు. అలాగే, ఇంటర్నేషనల్ టాక్సేషన్ అసెస్ మెంట్ టెస్ట్ (international taxation- Assessment Test) ను మే నెల 11, 13 తేదీల్లో నిర్వహిస్తారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా మే 5వ తేదీన ఏ పరీక్షలు ఉండవు. పూర్తి వివరాలకు, ఎగ్జామ్ డేట్ షీట్ కోసం ఐసీఏఐ అధికారిక వెబ్ సైట్ icai.org ను పరిశీలించండి. పూర్తి టైమ్ టేబుల్ కు డైరెక్ట్ లింక్ ఇదే.. Complete timetable Here

IPL_Entry_Point

టాపిక్