ICAI Results 2022: సీఏ ఫైనల్, ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. మీ రిజల్ట్ చెక్ చేసుకోండి-icai results 2022 ca final inter nov results out how to check other details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Icai Results 2022: Ca Final, Inter Nov Results Out, How To Check, Other Details

ICAI Results 2022: సీఏ ఫైనల్, ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. మీ రిజల్ట్ చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 05:23 PM IST

గత సంవత్సరం నవంబర్ లో జరిగిన చార్టర్డ్ అకౌంటంట్ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు (ICAI Results 2022) వెలువడ్డాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT)

చార్టర్డ్ అకౌంటన్సీ(Chartered Accountancy CA) ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలను ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (The Institute of Chartered Accountants of India ICAI) జనవరి 10న విడుదల చేసింది. ఈ పరీక్షలను 2022 నవంబర్ లో నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

ICAI Results 2022: ఈ వెబ్ సైట్లో..

సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ (Chartered Accountancy (CA) Final and Intermediate exam) ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్స్ icai.org లేదా icai.nic.in లలో చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లలో రిజల్ట్స్ లింక్ ను క్లిక్ చేసి, తమ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు రోల్ నెంబర్ ను ఎంటర్ చేసి అభ్యర్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. icai.org, లేదా icaiexam.icai.org, లేదా caresults.icai.org లేదా icai.nic.in. వెబ్ సైట్లలో ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ కింద ఉన్న డైరెక్ట్ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ వెబ్ సైట్లలో ఫలితాలను చెక్ చేసుకున్న తరువాత రిజల్ట్ ను, స్కోర్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్ర పర్చుకోవాలి. అలాగే, వాటిని ప్రింట్ తీసుకుని హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోవాలి.

WhatsApp channel

టాపిక్