Hit and Drag: దారుణం: పిల్లాడిని 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన ట్రక్.. బాలుడి మృతి.. వృద్ధుడు కూడా.. : Video-hit and drag accident in up truck drags 6 year old for 2 kilometers boy grandfather die ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Hit And Drag Accident In Up Truck Drags 6 Year Old For 2 Kilometers Boy Grandfather Die

Hit and Drag: దారుణం: పిల్లాడిని 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన ట్రక్.. బాలుడి మృతి.. వృద్ధుడు కూడా.. : Video

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 26, 2023 03:43 PM IST

Hit and Drag - Mahoba Accident: స్కూటర్‌ను ఢీకొట్టిన భారీ ట్రక్.. దాన్ని రెండు కిలోమీటర్ల వరకు అలాగే లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల పిల్లాడితో పాటు అతడి తాత కూడా మృతి చెందారు.

Hit and Drag: దారుణం: పిల్లాడిని 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన ట్రక్
Hit and Drag: దారుణం: పిల్లాడిని 2 కిలోమీటర్లు లాక్కెళ్లిన ట్రక్

Uttar Pradesh’s Mahoba accident: మరో హిట్ అండ్ డ్రాగ్ దారుణం (Hit-and-Drag Case) జరిగింది. ఓ ఆరు సంవత్సరాల పిల్లాడిని ఓ ట్రక్ రెండు కిలోమీటర్ల వరకు లాక్కెళ్లింది. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ రోడ్డు ప్రమాదంలో అతడి తాత కూడా చనిపోయారు. ఉత్తర ప్రదేశ్‍లోని మహోబా (Mahoba) జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాత, మనవడు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టాక కూడా ట్రక్ ఆగకుండా అలాగే వేగంగా వెళ్లింది. వివరాలివే…

ట్రెండింగ్ వార్తలు

వేగంగా వచ్చి ఢీకొని..

Uttar Pradesh’s Mahoba accident: ఈ ప్రమాదంలో బాలుడు సాత్విక్ (6), ఉదిత్ నారాయణ్ చన్సోరియా (67) మృతి చెందారు. వీరిది మహోబాలోని హమిర్‌పూర్ చుంగి. శనివారం వారిద్దరూ స్కూటీపై మార్కెట్‍కు వెళుతుండగా.. స్పీడ్‍గా వచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఉదిక్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ట్రక్ ముందు భాగంలో బంపర్‌కు స్కూటర్ ఇరుక్కుంది. బాలుడు సాత్విక్ కూడా చిక్కుకుపోయాడు. స్కూటర్ చిక్కుకోపోయినా.. ట్రక్ డ్రైవర్ ఆపకుండా వేగంగా నడిపాడు. దీంతో స్కూటర్‌తో పాటు బాలుడిని ఆ ట్రక్ సుమారు 2 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లింది. దీంతో ఆ పిల్లాడు కూడా చనిపోయాడు. కాన్‍పూర్ - సాగర్ నేషనల్ హైవే 86పై ఈ దారుణం జరిగింది.

ఆగకుండా..

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ట్రక్ కింద స్కూటర్ ఇరుక్కుపోయిందని ఆ దారిలో వెళుతున్న కొందరు బైకర్లు చెబుతున్నా.. వినిపించుకోని ఆ ట్రక్ డ్రైవర్ అలాగే వేగంగా నడిపాడు. చివరికి కొందరు రాళ్లు రువ్వటంతో ట్రక్‍ను ఆపాడు. పరారయ్యేందుకు ట్రక్ డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే అక్కడి వారు అతడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Hit-and-Drag Accidents: ఇటీవల హిట్ అండ్ డ్రాగ్ ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో అంజలి అనే అమ్మాయిని ఏకంగా ఓ కారు 12 కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందారు. అదే నెలలో బిహార్‌లో ఓ వృద్ధుడిని ఢీకొట్టిన కారు 8 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈనెలలో యమునా ఎక్స్‌ప్రెస్‍వేపై కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

IPL_Entry_Point