US visa : స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ఫీజును భారీగా పెంచిన అమెరికా!-cost of us tourist and student visas to rise from may 30 all you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cost Of Us Tourist And Student Visas To Rise From May 30 - All You Need To Know

US visa : స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ఫీజును భారీగా పెంచిన అమెరికా!

Sharath Chitturi HT Telugu
Apr 09, 2023 11:35 AM IST

US Student visa cost hike : స్టూడెంట్​, టూరిస్ట్​తో పాటు పలు కేటగిరీల్లోని వీసాల ఫీజును పెంచింది అమెరికా. ఈ ధరలు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి రానున్నాయి.

స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ధరలను పెంచిన అమెరికా
స్టూడెంట్​, టూరిస్ట్​ వీసాల ధరలను పెంచిన అమెరికా (AFP)

US increases Visa cost : అమెరికాలో చదువు లేదా పర్యటనల కోసం ప్లాన్​ చేస్తున్న వారికి కీలక అప్డేట్​! స్టూడెంట్​, టూరిస్ట్​తో పాటు పలు కేటగిరీల్లోని​ వీసాల ఫీజులను అగ్రరాజ్యం పెంచింది. ప్రాసెసింగ్​ ఫీజు పెంపు ఇందుకు ప్రధాన కారణం. ఈ 15డాలర్లు- 110డాలర్ల ధరల పెంపు నిర్ణయం మే 30 నుంచి అమల్లోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు

వీటి ధరలు పెరిగాయి..

US increases student Visa cost : "బిజినెస్​/ టూరిజం కోసం ఇచ్చే విజిటర్​ వీసా (బీ1/బీ2), స్టూడెంట్​, ఎక్స్​ఛేంజ్​ విజిటర్​ వీసాల ఫీజును 160 డాలర్ల నుంచి 185డాలర్లకు పెంచడం జరిగింది," అని ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తాత్కాలిక వర్కింగ్​ వీసాలైన హెచ్​, ఎల్​, ఓ, పీ, క్యూ, ఆర్​ కేటగిరీలకు సైతం ఫీజు పెరిగింది. తాజా పెంపుతో అది 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు చేరింది. ట్రీటీ 'ఈ' కేటగిరీలోని ట్రేడర్​, ట్రీటీ విజిటర్​, ట్రీటీ అప్లికెంట్స్​ ఫీజు 205 డాలర్ల నుంచి ఏకంగా 315 డాలర్లకు పెంచింది అమెరికా ప్రభుత్వం. తాజా నిర్ణయంతో ఇతర కాన్సులర్​ ఫీజుల్లో మార్పులేం లేవని స్పష్టం చేసింది.

వీసాలే.. వీసాలు..

US tourist Visa cost hike : వీసా జారీ చేసే సమయాన్ని తగ్గించేందుకు ఇటీవలి కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది అమెరికా. హెచ్​1బీ వీసాల స్టాంపింగ్​ దేశం బయట కూడా చేసే విధంగా పైలట్​ ప్రాజెక్ట్​ను చేపట్టాలని నిర్ణయించింది. ఇది రానున్న నెలల్లో అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతం వర్కింగ్​ వీసాల కోసం అప్లై చేస్తున్న భారతీయులు 60-280 రోజుల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. ట్రావెలింగ్​ వీసాకైతే ఏకంగా 1-ఒకటిన్నరేళ్ల వరకు సమయం పడుతోంది. గతేడాది 1,25,000 మంది భారతీయులకు స్టూడెంట్​ వీసాలను జారీ చేసింది అమెరికా రాయబార కార్యాలయం. ఇదొక రికార్డు. అయితే ఈ ఏడాది ఈ రికార్డు బ్రేక్​ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం