Affair with Teacher, Student ends life: టీచర్ తో అఫైర్; విద్యార్థి ఆత్మహత్య
చెన్నైలో 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక టీచర్ తో అఫైరే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు తేల్చారు.
Chennai Student Dies By Suicide: 10 వ తరగతి నుంచి మూడేళ్ల పాటు తన వద్ద చదువుకున్న విద్యార్థితో ఒక టీచర్ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ తరువాత తనకు వివాహం నిశ్చయం కావడంతో ఆ అఫైర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది.
Affair with Teacher, Student ends life: విద్యార్థి ఆత్మహత్య..
ఇదే విషయం ఆ విద్యార్థికి చెప్పింది. దాంతో మనస్తాపానికి గురైన ఆ 17 ఏళ్ల విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి ఫోన్ లో ఆ టీచర్ తో సన్నిహితంగాఉన్న ఫొటోలను చూసిన పోలీసులు, ఆ టీచర్ ను అరెస్ట్ చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
Affair with Teacher, Student ends life: గవర్న్మెంట్ టీచర్..
చెన్నైకి 20 కిమీల దూరంలోని అంబత్తూర్ లోని ఒక ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న యువతి అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దాదాపు 3 ఏళ్ల పాటు వారి సంబంధం కొనసాగింది. సబ్జెక్ట్ డౌట్లను తీర్చుకునే నెపంతో ఆ విద్యార్థి తరచూ ఆ టీచర్ ఇంటికి వెళ్తుండేవాడు. అనంతరం, ఆ టీచర్ కు వివాహం నిశ్చయం కావడంతో ఈ సంబంధాన్ని ఆపేయాలని భావించింది. అదే విషయం ఆ విద్యార్థికి చెప్పడంతో, అది తట్టుకోలేని ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెలలో 12వ తరగతి పరీక్షల అనంతరం ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో ఆ విద్యార్థి సెల్ ఫోన్ లో ఆ టీచర్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు పోలీసులకు కనిపించాయి. దాంతో, వారు ఆ టీచర్ ను అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.