CBSE Exam Dates 2023 : త్వరలో సీబీఎస్​ఈ 10,12 టైమ్​ టేబుల్స్​ విడుదల!-cbse exam dates 2023 updates on class 10 12 time table check full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Exam Dates 2023 : త్వరలో సీబీఎస్​ఈ 10,12 టైమ్​ టేబుల్స్​ విడుదల!

CBSE Exam Dates 2023 : త్వరలో సీబీఎస్​ఈ 10,12 టైమ్​ టేబుల్స్​ విడుదల!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 06, 2022 10:28 AM IST

CBSE Exam Dates 2023 : సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్షలు సమీపిస్తున్నాయి. కాగా.. ఈ నెలలో వీటికి సంబంధించిన టైమ్​ టేబుల్స్​ విడుదలవుతాయని తెలుస్తోంది.

త్వరలోనే సీబీఎస్​ఈ 10,12 టైమ్​ టేబుల్స్​ విడుదల!
త్వరలోనే సీబీఎస్​ఈ 10,12 టైమ్​ టేబుల్స్​ విడుదల!

CBSE Exam Dates 2023 : 2023 సీబీఎస్​ఈ పరీక్షల తేదీల వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10, 12 తరగతుల పరీక్షల టైమ్​టేబుల్స్​కు సంబంధించిన వివరాలు రిలీజ్​ అయిన తర్వాత.. సీబీఎస్​ఈ అధికారిక వెబ్​సైట్​ cbse.nic.inలోకి వెళ్లి అభ్యర్థులు చెక్​ చేసుకోవచ్చు.

గత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే.. ఈ నెలలోనే సీబీఎస్​ఈ 10,12 పరీక్షల తేదీలు వెలువడాల్సి ఉంది. ఈసారి తుది పరీక్షలు ఫిబ్రివరి 15 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే ప్రకటించింది సీబీఎస్​ఈ. సాధారణంగా అయితే.. పరీక్షలకు ఒకటిన్నర లేదా రెండు నెలల ముందు ఎగ్జామ్​ టైమ్​టేబుల్​ బయటకొస్తుంది.

CBSE class 10 exam time table : కొవిడ్​ కారణంగా.. గతేడాది 10, 12 తరగతుల పరీక్షలను రెండుసార్లు నిర్వహించింది సీబీఎస్​ఈ. సీఐఎస్​సీఈతో పాటు ఇతర బోర్డులు కూడా రెండుసార్లు నిర్వహించాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి మాత్రమే నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.

సీబీఎస్​ఈ బోర్డ్​ పరీక్షల వెబ్​సైట్స్​..

  • మెయిన్​:- cbse.gov.in, cbse.nic.in
  • అకాడమిక్​:- cbseacademic.nic.in
  • ఫలితాలు:- result.cbse.nic.in

ఎగ్జామ్​ టైమ్​ టేబుల్​ను డౌన్​లోడ్​ చేసుకోండిలా..

స్టెప్​ 1:- cbse.gov.in లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- మెయిన్​ వెబ్​సైట్​లోకి వెళ్లండి

CBSE class 12 exam time table : స్టెప్​ 3:- లేటెస్ట్​ సెక్షన్​లో.. క్లాస్​ 10, 12 డేట్​ షీట్​ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- డేట్​ షీట్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.

10, 12 తరగతుల విద్యార్థల ప్రాక్టీస్​ కోసం శాంపిల్​ పేపర్స్, క్వశ్చన్​ బ్యాంక్​​ను విడుదల చేసింది సీబీఎస్​ఈ. cbseacademic.nic.in. లోకి వెళ్లి అభ్యర్థులు వీటిని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

10, 12 తరగతుల పరీక్షల డేట్స్​ను సీఐఎస్​సీఈ ప్రకటించేసింది. ఈ నేపథ్యంలో సీబీఎస్​ఈ పరీక్షల టైమ్​టేబుల్స్​ కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం