Bhagavad Gita park vandalised : కెనడాలోని శ్రీ భగవద్​ గీతా పార్కు ధ్వంసం-canadas newly unveiled bhagavad gita park vandalised mayor orders probe ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Canada's Newly Unveiled Bhagavad Gita Park Vandalised; Mayor Orders Probe

Bhagavad Gita park vandalised : కెనడాలోని శ్రీ భగవద్​ గీతా పార్కు ధ్వంసం

Sharath Chitturi HT Telugu
Oct 02, 2022 02:08 PM IST

Canada Bhagavad Gita park vandalised : కెనడాలో ఇటీవలి కాలంలో హిందువులే టార్గెట్​గా విధ్వంసాలు జరుగుతున్నాయి. తాజాగా.. శ్రీ భగవద్​ గీతా పార్కును దుండగులు ధ్వంసం చేశారు.

కెనడాలోని శ్రీ భగవద్​ గీతా పార్కు ధ్వంసం
కెనడాలోని శ్రీ భగవద్​ గీతా పార్కు ధ్వంసం

Canada Bhagavad Gita park vandalised : కెనడాలో ఇటీవలే ఆవిష్కరించిన శ్రీ భగవద్​ గీతా పార్కును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ వార్తను అక్టోబర్​ 1న బ్రామ్​ప్టన్​ మేయర్​ పాట్రిక్​ బ్రౌన్​ ధ్రువీకరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మేయర్​ పాట్రిక్​ బ్రౌన్​. ఇలాంటి వాటిని అస్సలు సహించబోమని అంటూ.. భగవ్​ గీతా పార్కు ధ్వంసం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అసలేం జరిగింది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పీల్​ రీజనల్​ పోలీస్​ అధికారులు రంగంలోకి దిగారు.

Canada Bhagavad Gita park : గత నెల 28వ తేదీన.. ఈ భగవద్​ గీతా పార్కును ఆవిష్కరించారు. అంతకుముందు దాని పేరు ట్రోయర్స్​ పార్కుగా ఉండేది. ఆవిష్కరణ కోసం దాని పేరు మార్చారు. ఆవిష్కరించిన రెండు రోజులకే కెనడా భగవద్​ గీతా పార్కు ధ్వంసం అవ్వడం వార్తలకెక్కింది.

"శ్రీ భగవద్​ గీతా పార్కు ధ్వంసమైందన్న విషయం మాకు తెలిసింది. ఇలాంటి వాటిని మేము సహించము. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. పార్కు సిబ్బంది.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు," అని మేయర్​ ట్వీట్​ చేశారు.

3.75ఎకరాల విస్తీర్ణంలో ఈ భగవద్​ గీతా పార్కు ఉంది. రంథంపై ఉన్న కృష్ణుడు, అర్జునుడి విగ్రహాలను పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర హిందూ దేవుళ్ల విగ్రహాలను కూడా ప్రతిష్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. నగరం అభివృద్ధి కోసం హిందూ సమాజం చేసిన కృషికి చిహ్నంగా పార్కును ఈ విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు.. ఆవిష్కరణ సమయంలో మేయర్​ పాట్రిక్​ బ్రౌన్​ వెల్లడించారు.

కెనడాలో పెరుగుతున్న నేరాలు..

Hate crime on Hindus in Canada : కెనడాలో ఇటీవలి కాలంలో హేట్​ క్రైమ్​ పెరుగుతోంది! ముఖ్యంగా హిందూ ఆలయాలను టార్గెట్​గా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. కెనడాకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు సూచనలు కూడా జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

నేరాలకు పాల్పడుతున్న వారిని అక్కడి ప్రభుత్వం ఇంకా శిక్షించకపోవడం ఆందోళనకర విషయం అని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది.

హిందూ ఆలయాలపై జరుగుతున్న ఘటనలపై కెనడా ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని త్వరగా వెతకాలని డిమాండ్లు చేస్తున్నారు.

కెనడాలో ఇటీవలి కాలంలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా అక్కడికి వలసలు కూడా పెరుగుతున్నాయి. వారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. కెనడాలో పరిస్థితులు ఆవేదనకు గురిచేస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం