Car Drags Man for 10 KM: ఢిల్లీలో ఓ యువతి మృతదేహాన్ని ఓ కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన గత నెల జరగగా.. ఇప్పుడు తాజాగా ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లో దాదాపు ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఓ వ్యక్తి శరీరాన్ని ఓ కారు ఏకంగా 10 కిలోమీటర్ల మేర లాక్కెళ్లింది. కారు అండర్‌క్యారేజీకి ఆ వ్యక్తి శరీరం చిక్కుకోగా.. దీన్ని గమనించని డ్రైవర్.. అలాగే కారు నడిపారు. దీంతో 10 కిలోమీటర్ల వరకు ఆ వ్యక్తిని కారు ఈడ్చుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ మథుర (Mathura) సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వే (Yamuna Expressway)పై మంగళవారం (ఫిబ్రవరి 9) ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివే..,డ్రైవర్ ఏం చెప్పారంటే..UP Hit and Drag Case: ఓ వ్యక్తి శరీరాన్ని 10 కిలోమీటర్ల పాటు కారు ఈడ్చుకెళ్లిందని మథుర పోలీసులు తెలిపారు. ఆ కారు నడిపిన వ్యక్తిని ఢిల్లీకి చెందిన వీరేందర్ సింగ్‍గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వేరే యాక్సిడెంట్‍లో ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడని, తన కారుకు చిక్కుకున్నాడని వీరేందర్.. పోలీసులకు చెప్పారు.,అలా తెలిసిందిCar Drags Man for 10 KM: ఆగ్రా నుంచి నోయిడాకు వెళుతుండగా.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ వ్యక్తి శరీరం.. వీరేందర్ సింగ్ నడుపుతున్న కారుకు చిక్కుకుంది. మథుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‍వేపై ఇది జరిగింది. కారుకు వ్యక్తి శరీరం చిక్కుకొని ఉందని టోల్ బూత్ సిబ్బంది చెప్పటంతో అప్పుడు అతడు ఈ విషయాన్ని గమనించాడు. అప్పుడే వీరేందర్ సింగ్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు.,పొగమంచు తీవ్రతCar Drags Man for 10 KM: ఎక్స్‌ప్రెస్ వే వద్ద పొగ మంచు తీవ్రంగా ఉండటం వల్ల సరిగా కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. “ఎక్స్‌ప్రెస్ వే వద్ద గత రాత్రి పొగ మంచు కమ్ముకుంది. దీంతో రోడ్డుపై విజిబులిటీ సరిగా లేదు. ఈ కారణంగా.. ఏదో యాక్సిడెంట్‍కు గురైన వ్యక్తి.. కారుకు చిక్కుకున్నారు” అని వీరేందర్ చెప్పిన విషయాన్ని ఎస్‍పీ త్రిగుణ్ బిసెన్ వెల్లడించారు.,Car Drags Man for 10 KM: వీరేందర్ సింగ్‍ను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే సీసీ టీవీ ఫుటేజ్‍లను పరిశీలిస్తున్నారు. కారు ఈడ్చుకొని వచ్చిన వ్యక్తి ఎలా చనిపోయాడని తేల్చే పనిలో పడ్డారు. అలాగే చనిపోయిన వ్యక్తి ఎవరనే విషయంపై కూడా విచారణ చేస్తున్నారు.,ఢిల్లీలో భయానక ఘటనDelhi Hit and Drag Case: గత నెల కొత్త సంవత్సరం రోజున ఢిల్లీలో ఓ భయానక ఘటన జరిగింది. అంజలి అనే ఓ 20 ఏళ్ల యువతిని సుల్తాన్ పురి ప్రాంతంలో ఢీకొట్టిన కారు 12 కిలోమీటర్ల పాటు ఆమెను ఈడ్చుకెళ్లింది. ఆమె అరుపులు వినిపించినా.. కారులోని వారు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర గాయాలపాలైన అంజలి మృతి చెందారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత నెల సంచలనమైంది. రోడ్డు భద్రతపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.,