NNS 25th April Episode: ​భాగీని నిలదీసిన మనోహరి.. అసలేం జరిగిందో అర్థంకాని స్థితిలో మిస్సమ్మ..-zee telugu serial nindu noorella saavasam today 25th april episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns 25th April Episode: ​భాగీని నిలదీసిన మనోహరి.. అసలేం జరిగిందో అర్థంకాని స్థితిలో మిస్సమ్మ..

NNS 25th April Episode: ​భాగీని నిలదీసిన మనోహరి.. అసలేం జరిగిందో అర్థంకాని స్థితిలో మిస్సమ్మ..

Hari Prasad S HT Telugu
Apr 25, 2024 12:05 PM IST

NNS 25th April Episode: ​నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (ఏప్రిల్ 25) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అమర్ ను పెళ్లి చేసుకున్న భాగీని మనోహరి నిలదీయగా.. అసలేం జరిగిందో తెలియక మిస్సమ్మ షాక్ తింటుంది.

భాగీని నిలదీసిన మనోహరి.. అసలేం జరిగిందో అర్థంకాని స్థితిలో మిస్సమ్మ..
భాగీని నిలదీసిన మనోహరి.. అసలేం జరిగిందో అర్థంకాని స్థితిలో మిస్సమ్మ..

NNS 25th April Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ గురువారం (ఏప్రిల్ 25) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. తన చెల్లి శరీరంలో చేరి మరోసారి తన భర్తను పెళ్లాడుతున్న అరుంధతి మంచితనం గుర్తు చేసుకుంటాడు చిత్రగుప్తుడు. కన్యాదానం, జీలకర్ర బెల్లం.. ఒక్కోతంతు జరుగుతుంటూ ఉంటే మనోహరి ఏం చేయలేక రూమ్​లోనే అరుస్తూ ఉంటుంది. తన స్థానంలో ఉన్నది ఎవరైనా వాళ్ల అంతు చూస్తానని అంటుంది. కానీ భాగమతి రూపంలో ఉన్న అరుంధతి మెడలో మరోసారి తాళి కడతాడు అమర్​.

తనకోసం వచ్చిన వాళ్లు వెళ్లడంతో మండపంలోకి పరిగెడుతుంది మనోహరి. అప్పటికే అమర్​, భాగీకి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లికూతురు స్థానంలో ఉన్నది మిస్సమ్మ అని తెలియక పిల్లలు బాధపడుతూ ఉంటారు. అమ్మాయికి బొట్టు పెట్టమని ముసుగు తీయమని చెబుతాడు పంతులు.

మిస్మమ్మను చూసి అందరూ షాక్

పెళ్లికూతురు స్థానంలో కూర్చున్న భాగమతిని చూసి అందరూ షాకవుతారు. భాగమతిని చూసి ఆశ్చర్య పోతుంది మనోహరి. అమర్​ కూడా షాకవుతాడు. మిస్సమ్మ ఇక్కడుందా అని పిల్లలు ఆశ్చర్యపోతారు. ఏయ్​ భాగీ.. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ పెళ్లి పీటల మీద నువ్వెందుకు కూర్చున్నావు అని అడుగుతుంది మంగళ. మిస్సమ్మ మనోహరి ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఎలా ఉన్నావ్ అని అడుగుతుంది నిర్మల.

పౌర్ణమి ఘడియలకు ఇంకా రెండు నిమిషాలే మిగిలి ఉన్నాయి.. ఈ బాలిక ఆ బాలిక శరీరమును వదిలిపెట్టి రావాల్సిందే అని గుప్తా అనుకుంటాడు. ఇంతలో మనోహరి పరిగెత్తుకొచ్చి మిస్సమ్మ ఎందుకిలా చేశావు.. మా ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేసే నువ్వు అమర్ చేత ఎందుకు తాళి కట్టించుకున్నావు.. అమర్ తాళి కట్టాల్సింది నా మెడలో.. జీవితం పంచుకోవాల్సింది నాతో.. ఎందుకిలాంటి పని చేశావు చెప్పు అని నిలదీస్తుంది.

భాగీ శరీరాన్ని వదిలేసిన అరుంధతి

అడుగుతుంది కదా చెప్పు అంటుంది మంగళ. ఏం చెప్పాలో అర్థంకాక సైలెంట్​గా ఉంటుంది భాగమతి రూపంలో ఉన్న అరుంధతి. మనోహరి కోపంతో మిస్సమ్మని నెట్టేస్తుంది. దాంతో ముందుకి తూలి పడబోతున్న మిస్సమ్మను పడకుండా పట్టుకుని వెనక్కి లాగుతాడు అమర్​. పౌర్ణమి ఘడియలు ముగియడంతో భాగమతి శరీరాన్ని వదిలేస్తుంది అరుంధతి.

తన కుటుంబాన్ని మనోహరి బారినుంచి కాపాడానని తృప్తిపడుతుంది. ఇంతలో మిస్సమ్మ స్పృహతప్పి పడిపోతుంది. అసలేం జరిగిందని అమర్​ కోపంగా అడుగుతాడు. అందరూ అయోమయంలో పడతారు. అంతా బాగైంది కాబట్టి తనని తీసుకెళ్లమని చెబుతుంది అరుంధతి. కానీ మనోహరి వల్ల భాగమతికి హాని తప్పదని అంటాడు గుప్త. మనోహరి ఏం చేసినా ఎదురు నిలబడే ధైర్యం, తెలివితేటలు భాగీకి ఉన్నాయంటుంది అరుంధతి.

అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మంగళకు ఫోన్​ చేస్తుంది మనోహరి. ఈ పెళ్లి వెనుక మంగళ కుట్ర ఏమైనా ఉందా అని అనుమానపడుతుంది. కానీ తమకు భాగీ ఇంత పని చేయబోతుందనే విషయం తెలియదని అంటుంది మంగళ. ఆలోచనలో పడుతుంది మనోహరి. ఏం జరిగిందో తెలియని భాగీ అమర్​తో తన పెళ్లిని ఎలా తీసుకుంటుంది? అరుంధతి ఆత్మను గుప్త తీసుకెళ్తాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఏప్రిల్ 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

IPL_Entry_Point