Vijay Deverakonda on Masooda Trailer: మసూద మిమ్మల్ని భయపెడుతుంది: విజయ్‌ దేవరకొండ-vijay deverakonda on masooda trailer says it is intriguing ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda On Masooda Trailer Says It Is Intriguing

Vijay Deverakonda on Masooda Trailer: మసూద మిమ్మల్ని భయపెడుతుంది: విజయ్‌ దేవరకొండ

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 04:52 PM IST

Vijay Deverakonda on Masooda Trailer: మసూద మిమ్మల్ని భయపెడుతుందని అన్నాడు టాలీవుడ్‌ యువ నటుడు విజయ్‌ దేవరకొండ. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్ తర్వాత అతడు మాట్లాడాడు.

మసూద టీమ్ తో విజయ్ దేవరకొండ
మసూద టీమ్ తో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda on Masooda Trailer: అద్భుతమైన ట్రైలర్‌.. చాలా ఆసక్తికరంగా ఉంది.. బాగా చేశారు అంటూ మసూద మూవీ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు విజయ్‌ దేవరకొండ. నవంబర్‌ 18న రిలీజ్‌ కాబోతున్న ఈ ట్రైలర్‌ను ఆదివారం (నవంబర్ 13) ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. ఈ ట్రైలర్‌ను విజయ్‌ లాంచ్ చేశాడు.

సీనియర్‌ నటి సంగీత నటించిన మసూద మూవీలో ట్రైలర్‌ భయపెట్టేలా సాగింది. ప్రతి సీన్‌ రోమాలు నిక్కొబొడుచుకునేలా చేసి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. దీంతో ఈ మూవీ గురించి విజయ్‌ మాట్లాడుతూ.. "టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు. మీకు నా పూర్తి మద్దతు ఉంటుంది. కొత్త స్టోరీలు, టాలెంట్‌ను ప్రోత్సహించే రాహుల్‌ యాదవ్‌ నక్కాకు అభినందనలు. మీ కలలన్నీ నిజం కావాలి" అని విజయ్‌ ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం విజయ్‌ ఈ మూవీని ప్రమోట్‌ చేస్తున్నాడు. టీమ్‌తోనూ కలిశాడు. వాళ్లతో కాసేపు ముచ్చటించాడు. కెమెరాలకు పోజులిచ్చాడు. ఈ రౌడీ హీరో సపోర్ట్‌తో మసూద టీమ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మళ్లీ రావాలాంటి మూవీలను నిర్మించిన స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ మసూద మూవీని నిర్మించింది.

నిర్మాతగా రాహుల్‌ యాదవ్‌కు ఇది మూడో సినిమా. ఈ మసూద మూవీ సాయి కిరణ్‌ను డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే ఎంతో అనుభజ్ఞుడైన డైరెక్టర్‌ సినిమా తీసినట్లుగా ఉంది. ట్రైలర్‌ మొదట్లో అంతా నార్మల్‌గానే ఉంటుంది.

అయితే సడెన్‌గా మూవీలోని ఫిమేల్‌ లీడ్‌ దెయ్యం పట్టినట్లుగా వ్యవహరించడం, ఆమెను ఓవైపు సైకియాట్రిస్ట్‌కు, మరోవైపు మంత్రగాడికి చూపించడం, తర్వాత జరిగిన పరిణామాలు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్‌ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ రిలీజ్‌ చేస్తోంది. సంగీత, తిరువీర్, కావ్య, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్‌, భండావి శ్రీధర్‌, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, సూర్యారావ్‌ తదితర నటీనటులు మసూదలో నటించారు.

IPL_Entry_Point