RRR Viral Video: వైరల్ అవుతున్న ‘నాటు నాటు' కవర్ సాంగ్.. ఓ లుక్కేయండి-this recreated version of naatu naatu song are going to viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  This Recreated Version Of Naatu Naatu Song Are Going To Viral

RRR Viral Video: వైరల్ అవుతున్న ‘నాటు నాటు' కవర్ సాంగ్.. ఓ లుక్కేయండి

Maragani Govardhan HT Telugu
Aug 02, 2022 08:49 AM IST

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలుసిన విషయమే. ఈ సాంగ్‌కు ఇప్పటికే కవర్ వెర్షన్లు వచ్చాయి. అయితే తాజాగా వచ్చిన రీక్రియేటెడ్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాటు నాటు కవర్ సాంగ్ వైరల్
నాటు నాటు కవర్ సాంగ్ వైరల్ (Instagram)

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఐదు నెలలు కావస్తున్నా.. ఈ సినిమా మేనియా ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ఇండియా చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా శ్రోతలను అలరించాయి. ఇంక నాటు నాటు సాంగ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాట వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులోని హుక్ స్టెప్‌తో చాలా మంది సాంగ్‌ను రీక్రియేట్ చేశారు. తాజాగా ఇలాంటి నాటు నాటు రీక్రియెట్ వెర్షన్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అంటారా, అంకిత అనే ఇద్దరు సిస్టర్స్ నాటు నాటు సాంగ్‌ను తమదైన శైలిలో రీక్రియేట్ చేశారు. మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్ ఉపయోగిస్తూ.. అలాగే ఈ సాంగ్ హుక్ స్టెప్‌తో నర్తించడమే కాకుండా తమ సొంత గొంతుకతో పాటను ఆలపించారు. చూస్తే ఇట్టే ఆకట్టుకునేలా ఉన్న ఈ కవర్ సాంగ్‌ క్లిప్‌ను యూట్యూబ్ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇది పర్ఫెక్ట్ నాటు నాటు కవర్ సాంగ్ అవునా.. కాదా అంటూ పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా నెటిజన్లు కూడా ఈ సిస్టర్స్‌పై విశేషంగా స్పందిస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీలతో తమ స్పందనను తెలియజేస్తున్నారు. "ఓరీ దేవుడా.. వీరిద్దరూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు" అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. "ఈ ఇద్దరి సిస్టర్స్‌కు ఆల్ ది బెస్ట్" అని మరొకరు స్పందించారు. "ఇప్పటి వరకు వచ్చిన వెర్షన్లలో ఇదే బెస్ట్ నాటు నాటు వెర్షన్" అని ఇంకొకరు పోస్ట్ పెట్టారు.

ఇప్పటికే ఈ రిక్రియేట్ వెర్షన్‌ను ఇన్‌స్టాలో లక్షా 16 వేల మంది చూశారు. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్‌ను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 90 మిలియన్ల మంది చూశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్‌కు అమితంగా ఫాలోయింగ్ పెరిగింది.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం