Tamannaah on Rumours: రూమర్లపై తమన్నా క్లారిటీ.. బాధపడ్డానంటూ వివరణ..!
Tamannaah on Rumours: తమన్నా.. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో ప్రత్యేక గీతం చేస్తుందంటూ ఓ వార్త ఇటీవల హల్చల్ చేసింది. తాజాగా ఈ రూమర్లపై మిల్కీ బ్యూటీ స్పందించింది. అవే నిరాధారమైన రూమర్లని స్పష్టం చేసింది.
Tamannaah on Rumours: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తోంది. ఈ ముద్దుగుమ్మ గతేడాది ఎఫ్3తో, గుర్తుందా శీతాకాలం లాంటి చిత్రాల్లో సందడి చేసింది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఇటీవల కాలంలో తమన్నా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మద్దుగుమ్మ అనిల్ రావిపూడి-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK 108 అనే మూవీలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించనుందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై ఈ అమ్మడు క్లారిటీ ఇచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
"అనిల్ రావిపూడితో వర్క్ చేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ఆయనపై నాకు ఎంతో గౌరవముంది. నందమూరి బాలకృష్ణ సార్ అంటే కూడా ఎంతో రెస్పెక్ట్ ఉంది. అయితే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో నేను ఓ సాంగ్ చేస్తున్నానంటూ కొన్ని ఆధారం లేని ఆర్టికల్స్ రావడం నన్ను ఎంతో బాధించాయి. అప్‌సెట్‌కు గురిచేశాయి. నిరాధార ఆరోపణలు చేసేముందు సరైన పరిశోధన చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను." అని తమన్నా క్లారిటీ ఇచ్చింది.
అనిల్ రావిపూడి-బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న NBK 108లో ప్రత్యేక గీతం చేస్తుందని ఇటీవల కాలంలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సాంగ్ కోసం నిర్మాతల నుంచి భారీగా మిల్కీ బ్యూటీ డిమాండ్ చేసిందని, మేకర్స్ కూడా ఆమె చెప్పిన షరతలకు ఒప్పకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా తమన్నా క్లారిటీ ఇవ్వడంతో అవన్నీ బేస్‌లెస్ రూమర్లన్నీ తేలింది.
తమన్నా గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో కొన్ని మూవీస్‌కు పచ్చ జెండా ఊపింది ఈ ముద్దుగుమ్మ. ఈ జాబితాలో బోలే చూడియాన్, భోళా శంకర్, జైలర్, అరుణ్ గోపీ దర్శకత్వంలో రానున్న బాంద్రా లాంటి సినిమాలు ఉన్నాయి.