Sudheer Babu New Avatar: సరికొత్త అవతారంలో సుధీర్ బాబు.. సిక్స్ ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయిందా? ఇలా మారాడేంటి?
Sudheer Babu New Avatar: టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబు సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. మామ మశ్చీంద్ర అనే సినిమా కోసం అతడు లావుగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ మెయింటేన్ చేసే ఈ హీరో ఫ్యామిలీ ప్యాక్‌లోకి మారిపోయాడు.
Sudheer Babu New Avatar: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా చిత్రసీమలోకి అరంగేట్రం చేసినప్పటికీ.. ఆనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అదిరిపోయే డ్యాన్స్, ఆకట్టుకునే పర్సనాలిటీతో కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ఈ హీరో.. తాజాగా సరికొత్త అవతారంలో కనిపించాడు. లావుగా ఉండటమే కాకుండా తను ఇంతవరకు ఎప్పుడూ కనిపించని అన్ ఫిట్‍గా కనిపించాడు. చబ్బీగా ఉన్న సుధీర్ లుక్ చూసిన వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఇంతకీ సుధీర్ బాబు ఇంత లావుగా మారడానికి కారణమేంటో తెలుసా? మామ మశ్చీంద్ర అనే సినిమా కోసం సుధీర్ బాబు ఈ బబ్లీ లుక్‌లో కనిపించాడు. బుగ్గలు, పొట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడూ కనిపించని రూపంలో దర్శనమిచ్చాడు. ఈ సినిమాలో సుధీర బాబు మల్టీ షేడెడ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగా దుర్గా అనే పాత్ర కోసం ఈ విధంగా తన రూపాన్ని మార్చుకున్నాడు.
సుధీర్ బాబు లావుగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా విలక్షణంగా ఉంది. జీప్‌పై కూర్చున్న ఈ హీరో నోట్లో బంగారు గొలుసుతో ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపించాడు. పొడవాటి జుట్టు, తేలికపాటి గడ్డంతో దర్శనమిచ్చాడు.
మామా మశ్చీంద్రా అనే ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోందీ చిత్రం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పీజీ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. సుధీర్ బాబు ఇందులో మల్టీ షేడెడ్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
సంబంధిత కథనం