Pathaan Collections Day 2: పఠాన్ కాసుల వర్షం.. ఏ బాలీవుడ్ సినిమాకు దక్కని రికార్డు-shah rukh khan pathaan collects 70 crores in 2nd day creates another record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Collections Day 2: పఠాన్ కాసుల వర్షం.. ఏ బాలీవుడ్ సినిమాకు దక్కని రికార్డు

Pathaan Collections Day 2: పఠాన్ కాసుల వర్షం.. ఏ బాలీవుడ్ సినిమాకు దక్కని రికార్డు

Maragani Govardhan HT Telugu
Jan 27, 2023 08:22 AM IST

Pathaan Collections Day 2: షారుఖ్ నటించిన పఠాన్ చిత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. మరే బాలీవుడ్ సినిమాకు దక్కని రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండో రోజు రూ.70 కోట్ల వసూళ్లను సాధించింది.

పఠాన్ వసూళ్లు
పఠాన్ వసూళ్లు (MINT_PRINT)

Pathaan Collections Day 2: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత నటించిన పఠాన్ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిందీ బెల్టులో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. బుధవారం విడుదలైన ఈ సినిమా అత్యధిక బాలీవుడ్ ఓపెనర్‌గా రికార్డు సృష్టించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజే 50 కోట్లకుపై గా వసూళ్లను సాధించగా.. రెండో రోజుకు ఈ కలెక్షన్లు వంద కోట్ల మార్కును అందుకున్నాయి.

రెండో రోజుకు పఠాన్ సినిమా రూ.70 కోట్లను వసూలు చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.127 కోట్ల వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. తొలి రోజు రూ.57 కోట్లు, రెండో రోజు 70 కోట్లతో కాసుల వర్షాన్ని కురిపించింది. రిపబ్లిక్ డే పబ్లిక్ హాలిడే కావడంతో ప్రేక్షకులు విపరీతంగా ఈ సినిమా చూసేందుకు వచ్చారు. ఫలితంగా ఈ సినిమా భారీగా వసూళ్లను రాబట్టింది.

హిందీ బెల్టులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి, కేజీఎఫ్2 తర్వాత పఠాన్ మూడో స్థానంలో నిలిచింది. పఠాన్ కంటే ముందు ఈ రెండు చిత్రాలు కాకుండా మరి ఇంకే సినిమా దరిదాపుల్లో కూడా నిలువలేదు. దేశవ్యాప్తంగా సినిమా చూసేందుకు డిమాండ్ పెరగడంతో ఆ ప్రభావం వసూళ్లపై పడింది. విశ్వవ్యాప్తంగా 8 వేల స్క్రీన్లలో పఠాన్ విడుదల కాగా.. కేవలం విదేశాల్లోనే 2500 స్క్రీన్లలో విడుదలైంది. వీకెండ్ ముందుడటంతో ఈ వసూళ్ల మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల కానుంది. దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. విశాల్-శేఖర్ సంగీత దర్శకత్వం వహించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం